Breaking News

జీఎస్టీ తగ్గించినా లభించని ఊరట!

Published on Sun, 01/04/2026 - 08:25

సాక్షి, సిటీబ్యూరో: అధిక ధరలకు కళ్లెం వేసి.. పన్నుల భారం తగ్గించి.. సామాన్యులకు ఊరట కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 లక్ష్యం నీరుగారుతోంది. జీఎస్టీ రెండు స్లాబుల్లో 28 –18 శాతానికి, 12 నుంచి 5 శాతానికి పన్నులను కేంద్రం తగ్గించింది.

పన్ను వ్యవస్థను మరింత పారదర్శకంగా చేయడం, పన్ను ఎగవేతకు చెక్‌ పెట్టడం, నిజాయతీ గల వ్యాపారులకు సౌలభ్యం కల్పించడమే దీని ఉద్దేశం. అయితే రాష్ట్రంలో జీఎస్టీ సంస్కరణలు కేవలం సర్క్యులర్లు, ప్రకటనలు, పోర్టల్‌ మార్పులకే పరిమితమయ్యాయని పలువురు వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా వ్యాపార సంస్థలు తగ్గించిన పన్నులు కాకుండా యధాతథంగా పాత రేట్లతో బిల్లులు జారీ చేస్తున్నట్లు ‘సాక్షి’సర్వేలో తెలిసింది.

ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి పెట్టి పన్ను తగ్గింపు పూర్తిస్థాయిలో అమలవడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని వినియోగదారులు కోరుతున్నారు. వ్యాపారులు పాత రేట్లు వసూలు చేస్తూ వాణిజ్య పన్నుల శాఖకు మాత్రం కొత్త, తక్కువ రేట్లతో రిటర్న్స్‌ దాఖలు చేస్తున్నారని కొంతమంది అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇలా చేయడం జీఎస్‌టీ వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకానికి భంగం కల్పించినట్టేనని అంటున్నారు. జీఎస్‌టీ సంస్కరణలు అమలు కావాలంటే కఠిన తనిఖీలు, పాత రేట్ల వసూళ్లపై జీరో టాలరెన్స్‌ వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)