Breaking News

పాలసీబజార్ కార్యాలయంలో జీఎస్టీ సోదాలు

Published on Thu, 01/16/2025 - 10:51

పాలసీబజార్(Policybazaar) మాతృసంస్థ పీబీ ఫిన్‌టెక్‌ గురుగ్రామ్ కార్యాలయంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (DGGI) సోదాలు నిర్వహించింది. పాలసీబజార్ ఆఫ్‌లైన్‌ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్ విభాగమైన పీబీ పార్టనర్స్‌తో కలిసి కొందరు విక్రేతల ద్వారా పన్ను ఎగవేతకు పూనుకుందని ఆరోపణలొచ్చాయి. దాంతో జీఎస్టీ అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించినట్లు తెలిసింది.

ఈ సోదాల్లో భాగంగా అధికారులు కంపెనీ ఆవరణలోని డాక్యుమెంట్లు, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. జీఎస్టీ ఫైలింగ్‌లో వ్యత్యాసాలు, ఎగవేతలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ సోదాలపై పీబీ ఫిన్‌టెక్‌ స్పందించింది. జీఎస్టీ అధికారులకు అవసరమైన మొత్తం సమాచారాన్ని అందించినట్లు, తదుపరి ఏవైనా సమాచారం కావాల్సి వచ్చినా పూర్తిగా సహకరిస్తామని వెల్లడించింది. ఈ సోదాల వల్ల కంపెనీపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. ఈ కంపెనీ పైసాబజార్‌ను కూడా నిర్వహిస్తోంది. ఈ సోదాలకు సంబంధించి జీఎస్టీ అధికారిక వివరణ ఇవ్వలేదు.

ఇదీ చదవండి: హిండెన్‌బర్గ్‌ మూసివేత! బెదిరింపులు ఉన్నాయా..?

తనిఖీలు ఎందుకు..?

పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడటానికి, ఏదైనా పన్ను ఎగవేతను కనుగొనడానికి జీఎస్టీ అధికారులు సోదాలు నిర్వహిస్తూంటారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) ఫ్రేమ్వర్క్ కింద ఎన్‌ఫోర్స్‌మెంట్‌ చర్యల్లో భాగంగా ఈ సోదాలు చేస్తారు. అయితే ఇలా నిర్వహించే సోదాలకు చాలా కారణాలున్నాయి. జీఎస్టీ ఫైలింగ్‌లో వ్యత్యాసాలను గుర్తించడానికి, పన్ను ఎగవేతను వెలికితీయడానికి ఇవి సహాయపడతాయి. తనిఖీల సమయంలో మోసపూరిత కార్యకలాపాలను సూచించే పత్రాలు, రికార్డులు, ఇతర సాక్ష్యాలను అధికారులు స్వాధీనం చేసుకోవచ్చు. పన్నులు ఎగవేయాలని భావించే వ్యాపారాలు, వ్యక్తులకు ఈ తనిఖీలు అడ్డంకిగా మారుతాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)