రూ.13.83 కోట్ల జీఎస్‌‌‌‌టీ నోటీసు.. ఆ తేడాలే కారణం..

Published on Tue, 01/02/2024 - 08:19

ఏషియన్‌ పెయింట్స్‌ కంపెనీ రూ.13.83 కోట్ల జీఎస్టీ, రూ.1.38 కోట్ల పెనాల్టీ చెల్లించాలని కేంద్ర పన్నుల డిప్యూటీ కమిషనర్ డిమాండ్​ నోటీసు పంపినట్లు సంస్థ ఫైలింగ్‌లో తెలియజేసింది. ఇన్‌‌‌‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ)లో తేడాలపై 2017–18 ఆర్థిక సంవత్సరానికి ఈ డిమాండ్ నోటీసు వచ్చినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో తెలిపింది.

ఈ నోటిసుకు వ్యతిరేకంగా అప్పీల్ చేస్తామని సంస్థ ప్రకటించింది. ఏషియన్ పెయింట్స్ కంపెనీ చేసిన సరఫరాలపై ఐటీసీని పొందడానికి వర్తించే అన్ని పన్నులను చెల్లించినట్లు కంపెనీ చెప్పింది. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017  తమిళనాడు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ యాక్ట్, 2017 సంబంధిత నిబంధనల ప్రకారం ఈ నోటీసులు వచ్చినట్లు తెలిసింది.

ఇదీ చదవండి: ప్యాకేజ్డ్‌ ఉత్పత్తుల ముద్రణలో కీలక మార్పులు..

ఏషియన్‌ పెయింట్స్‌ కంపెనీను 1942లో చంపక్‌లాల్‌ చోక్సీ, చిమన్‌లాల్‌ చోక్సీ స్థాపించారు. 1965 వరకు ఏషియన్‌ ఆయిల్‌ అండ్‌ పెయింట్‌ కంపెనీ ఉన్న సంస్థ పేరును ఏషియన్‌ పెయింట్స్‌గా మార్చారు. ఇండియాలో మొత్తం 10 తయారీ కేంద్రాలున్నాయి. తెలుగురాష్ట్రాల్లో హైదరాబాద్‌లోని పటాన్‌చెరు, విశాఖపట్నంలో మ్యానుఫ్యాక్చరింగ్‌ యూనిట్లున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)