Breaking News

రూ.1.82 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

Published on Sun, 12/01/2024 - 19:42

వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు నవంబర్‌లో మెరుగ్గానే నమోదయ్యాయి. సమీక్షా నెలలో 8.5 శాతం పురోగతితో (2023 ఇదే నెలతో పోలిస్తే) రూ.1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దేశీయ లావాదేవీల నుంచి జీఎస్టీ 9.4 శాతం పెరిగి రూ.1.40 లక్షల కోట్లకు చేరుకోగా, దిగుమతులపై పన్ను ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 6 శాతం పెరిగి రూ.42,591 కోట్లకు చేరుకుంది.

రిఫండ్స్‌ రూ.19,259 కోట్లు

నవంబర్‌ జీఎస్‌టీ వసూళ్లు రూ.1,82 కోట్లలో రూ.19,259 కోట్ల రిఫండ్స్‌ జరిగాయి. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే 8.9 శాతం క్షీణతను నమోదు చేసింది. రీఫండ్‌లను సర్దుబాటు చేసిన తర్వాత నికర జీఎస్టీ వసూళ్లు 11 శాతం పెరిగి రూ.1.63 లక్షల కోట్లకు చేరాయి.

విభాగాల వారీగా..

→ మొత్తం వసూళ్లు రూ.1,82 కోట్లు
→ సెంట్రల్‌ జీఎస్‌టీ రూ.34,141 కోట్లు 
→ స్టేట్‌ జీఎస్‌టీ రూ.43,047 కోట్లు 
→ ఇంటిగ్రేటెడ్‌ ఐజీఎస్‌టీ విలువ రూ.91,828 కోట్లు 
→ సెస్‌ రూ.13,253 కోట్లు.

ఇదీ చదవండి: చావు ఏ రోజో చెప్పే ఏఐ!

డిసెంబర్‌ 21న జీఎస్టీ కౌన్సిల్‌  సమావేశం

మరోవైపు డిసెంబర్ 21న జైసల్మేర్‌లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహిస్తారని ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కౌన్సిల్ మొదట నవంబర్‌లో సమావేశం కావాలని నిర్ణయించారు. కానీ మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు శీతాకాల సమావేశాల కారణంగా వాయిదా పడింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)