Breaking News

ఇండిగోకు రూ.115.86 కోట్ల జరిమానా

Published on Thu, 02/06/2025 - 08:13

విదేశాలకు చెందిన తన కస్టమర్లకు ఎగుమతులుగా పరిగణించని సేవలను అందించినందుకు ఇండిగో(Indigo)పై జీఎస్టీ అధికారులు జరిమానా విధించారు. దాంతోపాటు 2018, 2019, 2020 ఆర్థిక సంవత్సరాలకు ఇన్‌పుట్‌ ట్యాక్స్ క్రెడిట్లను చెల్లించేందుకు నిరాకరించినందుకు ఇండిగో మొత్తం రూ.115.86 కోట్ల జరిమానా చెల్లించాలని తెలిపారు. ఇండిగో ప్రస్తుతం ఈ ఉత్తర్వులను అప్పిలేట్ అథారిటీ ముందు సవాలు చేస్తోంది.

ఫిబ్రవరి 4, 2025న ప్రకటించిన జరిమానాలో విదేశాల్లోని సంస్థ సర్వీసులు పొందేవారికి సంబంధించిన రూ.113.02 కోట్లు ఉన్నాయి. వీటిని జీఎస్టీ అధికారులు ‘సేవల ఎగుమతి’గా వర్గీకరించలేదు. దీనికితోడు నిర్దిష్ట ఆర్థిక సంవత్సరాలకు ఇన్‌పుట్‌ ట్యాక్స్ క్రెడిట్స్ చెల్లించేందుకు సంస్థ నిరాకరించింది. దాంతో రూ.2.84 కోట్ల జరిమానా చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.115.86 కోట్లు ఫైన్‌ కట్టాలని అధికారులు తెలిపారు.

ఇండిగో స్పందన..

జీఎస్టీ(GST) విధించిన జరిమానాకు ప్రతిస్పందనగా ఇండిగో తన ఆర్థిక కార్యకలాపాలు లేదా ఇతర కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం ఉండదని వాటాదారులకు హామీ ఇచ్చింది. తగిన చట్టపరమైన మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇండిగో విమానయాన మార్కెట్‌ వాటా ఎక్కువగానే ఉంది. ఆర్థిక పనితీరు బలంగా ఉంది. కంపెనీ ఆదాయంలో క్రమంగా పెరుగుదల నమోదవుతోంది.

Videos

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు