Breaking News

రెండు సంస్థలదే ఆధిపత్యం!

Published on Thu, 11/14/2024 - 12:05

దేశంలో మరిన్ని విమానయాన సంస్థలు కార్యకలాపాలు సాగించాలని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం రెండు ప్రముఖ కంపెనీలే అధిక వ్యాపార వాటాను కలిగి ఉన్నాయని చెప్పారు. విమానయాన రంగంలో రెండు సంస్థలే ఆధిపత్యం కొనసాగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఈటీ ఇండియా అసెండ్స్ ఈవెంట్‌లో నాయుడు పాల్గొని మాట్లాడారు.

‘ఏ పరిశ్రమలోనైనా పోటీ ఉండాలి. దాంతో వినియోగదారులకు తక్కువ ధరలకే సేవలందుతాయి. కానీ విమానయాన పరిశ్రమలో కేవలం రెండు సంస్థలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ రంగం ఈ సంస్థలకే పరిమితం కావడం సరైందికాదు. మరిన్ని కంపెనీలు ఈ విభాగంలో సేవలందించాలి. దాంతో వినియోగదారులకు మరింత మెరుగైన సేవలందుతాయి. విమాన ప్రయాణం అందుబాటు ధరలో ఉండేలా ప్రభుత్వం టిక్కెట్‌ ధరలపై కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ రంగంలో ప్రైవేట్‌ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నా ప్రభుత్వం విభిన్న పాలసీలను తయారుచేస్తోంది. ఈ రంగాన్ని మరింత ఉత్తమంగా ఎలా చేయగలమో ఆయా సంస్థలతో చర్చిస్తోంది. ఏదైనా విమానయాన సంస్థ దివాలా తీయడం లేదా పరిశ్రమను వదిలివేయడం మాకు ఇష్టం లేదు. ఈ పరిశ్రమలోకి కొత్త విమానయాన సంస్థలు ప్రవేశించేలా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోంది. ప్రైవేట్‌ మూలధనం ద్వారా కార్యకలాపాలు సాగించే కొత్త కంపెనీలు దివాలా దిశగా వెళితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటుంది’ అని అన్నారు.

ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్‌ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధం

ఎయిరిండియా గ్రూపులో ఇటీవల విస్తారా విలీనం అయింది. దాంతో దేశీయ విమానయాన మార్కెట్‌ వాటాలో 80 శాతం ఇండిగో, ఎయిరిండియాలే సొంతం చేసుకుంటున్నాయి. రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఏప్రిల్‌ 2023లో మరో పదేళ్ల కాలంపాటు అంటే 2033 వరకు ఈ పథకాన్ని పొడిగించారు. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్‌(ఉడాన్‌) పథకంలో భాగంగా ప్రాంతీయ విమాన కనెక్టివిటీని మెరుగుపరచడం, విమానయానాన్ని మరింత మందికి అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)