Breaking News

భద్రతే లక్ష్యంగా కొత్త రూల్: నితిన్ గడ్కరీ

Published on Thu, 09/04/2025 - 21:17

ఇప్పటివరకు కార్లకు మాత్రమే న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (NCAP) ద్వారా సేఫ్టీ రేటింగ్ అందించేవారు. అయితే ఈ-రిక్షాలకు భద్రతా ప్రమాణాలను అందించడానికి ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా చర్యలను పెంపొందించడానికి ఈ చర్యను చేపడుతున్నట్లు ఆయన వివరించారు.

ఎఫ్ఐసీసీఐ రోడ్డు భద్రతా అవార్డులు & సింపోజియం 7వ ఎడిషన్‌ కార్యక్రమంలో, మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ప్రభుత్వానికి రోడ్డు భద్రత ఒక ముఖ్యమైన అంశం అని అన్నారు. దేశంలో ఏటా దాదాపు ఐదు లక్షల రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇందులో 1.8 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ 1.8 లక్షల మరణాలలో.. దాదాపు 66.4 శాతం మంది 18 నుంచి 45 సంవత్సరాల వయస్సు వారే అని ఆయన పేర్కొన్నారు.

ఈ-రిక్షాల సంఖ్య భారతదేశంలో ఎక్కువవుతున్నాయి. ఈ తరుణంలో భారత్ ఎన్‌సీఏపీ లాంటి ప్రమాణాలు తీసుకురావలసిన అవసరం ఉంది. ఇది భద్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుందని నితిన్ గడ్కరీ వివరించారు. 2023లో భారత్ ఎన్‌సీఏపీ ప్రారంభమైంది. ఇది వాహనాల భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది.

రోడ్డు ప్రమాదాలపై మరింత మాట్లాడుతూ.. హెల్మెట్లు ఉపయోగించకపోవడం వల్లే దాదాపు 30,000 మరణాలు సంభవిస్తున్నాయని, సీటు బెల్టులు ఉపయోగించకపోవడం వల్లే 16,000 మరణాలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రమాదాలకు కారణాన్ని కనుగొనడానికి దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రతా ఆడిట్‌లు నిర్వహిస్తున్నట్లు గడ్కరీ అన్నారు.

ఇదీ చదవండి: ఈ కార్ల ధరలు రూ. 50వేలు తగ్గే అవకాశం..

రోడ్డు ప్రమాదాల గురించి
రోడ్డు ప్రమాదం ఒక సామాజిక సమస్య. ఇతర రంగాలలో మనం విజయాలను సాధించాము. కానీ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో మాత్రం విజయం సాధించలేకపోతున్నామని గడ్కరీ అన్నారు. ఒకవేళా ప్రమాదాలు జరిగినప్పుడు.. ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రులకు తీసుకెళ్లాలని ప్రజలను కోరారు, ఎందుకంటే ముందస్తు చికిత్స దాదాపు 50,000 మంది ప్రాణాలను కాపాడుతుందని అన్నారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)