Breaking News

ఎయిరిండియా అనుబంధ సంస్థలపై విదేశాల్లో రోడ్‌షో

Published on Fri, 03/14/2025 - 08:56

ఈ ఏడాది(2025) చివరి నాటికి ఎయిరిండియా మాజీ అనుబంధ సంస్థల్లో వాటాను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు వీలుగా మే నెలలో రోడ్‌ షోలు చేపట్టాలని యోచిస్తోంది. భారత్‌సహా సింగపూర్, యూరప్‌లో వీటిని నిర్వహించాలని చూస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్ట్‌లోగా ఆయా కంపెనీలపట్ల ఆసక్తి కలిగిన సంస్థలు బిడ్స్‌(ఈవోఐ) దాఖలు చేసేందుకు వీలు కల్పించనున్నట్లు తెలియజేశాయి.

కేంద్రం విక్రయించాలని నిర్ణయించిన కంపెనీల జాబితాలో ఎయిరిండియా ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ఏఐఈఎస్‌ఎల్‌), ఎయిరిండియా ఎయిర్‌ట్రాన్స్‌పోర్ట్‌ సర్వీసస్‌ (ఏఐఏటీఎస్‌ఎల్‌), ఎయిరిండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ (ఏఐఏఎస్‌ఎల్‌), హోటల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(హెచ్‌సీఐ), ఎయిర్‌లైన్‌ అలైడ్‌ సర్వీసెస్‌(ఏఏఎస్‌) ఉన్నాయి. వెరసి డిసెంబర్‌లోగా వాటాల విక్రయాన్ని పూర్తి చేసే సన్నాహాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ 2021వరకూ ప్రభుత్వ అజమాయిషిలోని ఎయిరిండియాకు అనుబంధ సంస్థలుగా వ్యవహరించాయి. కాగా.. 2022 జనవరిలో ఎయిరిండియా అధికారికంగా టాటా గ్రూప్‌ గూటికి చేరిన సంగతి తెలిసిందే.


స్పైస్‌జెట్‌లో 1% వాటా అమ్మకం

1.15 కోట్ల షేర్లు విక్రయించిన ప్రమోటర్‌

బడ్జెట్‌ ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌లో ప్రమోటర్‌ అజయ్‌ సింగ్‌ 0.9 శాతం వాటా విక్రయించారు. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీ ద్వారా షేరుకి రూ.45.34 సగటు ధరలో 1.15 కోట్ల షేర్లు అమ్మివేశారు. వెరసి రూ.52.3 కోట్లు అందుకున్నారు. ఈ లావాదేవీ తదుపరి స్పైస్‌జెట్‌లో అజయ్‌ సింగ్‌ వాటా 22 శాతానికి పరిమితమైంది. మొత్తం ప్రమోటర్‌ గ్రూప్‌ వాటా 29.13 శాతం నుంచి 28.23 శాతానికి తగ్గింది. వాటా కొనుగోలుదారుల వివరాలు వెల్లడికాలేదు.

ఇదీ చదవండి: జనరల్‌ ఇన్సూరెన్స్‌లోకి పతంజలి

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)