Breaking News

Fastag: వార్షిక టోల్‌ పాస్‌ను ప్రకటించిన కేంద్రం

Published on Wed, 06/18/2025 - 13:21

టోల్‌ గేట్‌ గుండా ప్రయాణించే వాహనదారులకు కేంద్రం వార్షిక పాస్‌ను ప్రకటించింది. రూ.3,000 ధరతో సంవత్సరం పొడవునా జాతీయ రహదారుల మీదుగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తున్నట్లు చెప్పింది. ఈ ఫాస్టాగ్ ఆధారిత పాస్ ఆగస్టు 15 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

యాక్టివేట్ చేసిన తేదీ నుంచి ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులు ఏది ముందు పూర్తయితే అప్పటివరకు పాస్ చెల్లుబాటు అవుతుందని మంత్రి తెలిపారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పాస్ హైవే ప్రయాణాన్ని చౌకగా, ఇబ్బంది లేకుండా మార్చడానికి వీలు కల్పిస్తుందని ఆయన చెప్పారు. పాస్‌ యాక్టివేషన్, రెన్యువల్‌ కోసం ప్రత్యేక లింక్‌ను త్వరలో రాజ్‌గార్‌ యాత్ర యాప్‌తో పాటు ఎన్‌హెచ్‌ఏఐ, ఎంఓఆర్‌టీహెచ్‌ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచుతామని గడ్కరీ తెలిపారు.

ఇదీ చదవండి: ముగ్గురి చేతుల్లోనే రూ.10 లక్షల కోట్లకుపైగా సంపద

ఈ విధానం 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న టోల్ ప్లాజాలకు సంబంధించి ప్రయాణికుల దీర్ఘకాలిక ఆందోళనలను పరిష్కరిస్తుందని చెప్పారు. పరిమిత కాలంపాటు ఒకేసారి టోల్ చెల్లింపులు చేసి ప్రయాణాన్ని సులభతరం చేసుకోవచ్చు. పండగలు, ఇతర ప్రత్యేక రోజుల్లో టోల్‌ గేట్ల వద్ద వెయిటింగ్‌ సమయాలను తగ్గించేందుకు వీలవుతుంది.

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు