Breaking News

ఈసీఎం స్కీమ్‌.. రూ.16 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు

Published on Sun, 07/27/2025 - 11:44

ఎల్రక్టానిక్స్‌ విడిభాగాల తయారీ స్కీమ్‌ (ఈసీఎంఎస్‌) కింద రూ. 16,000 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు కేంద్రానికి అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అనుమతుల ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, షార్ట్‌లిస్ట్‌ చేసిన ప్రాజెక్టుల పేర్లను సెప్టెంబర్‌లో ప్రకటించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దేశ, విదేశ కంపెనీల నుంచి ఈ స్కీముకు మంచి స్పందన లభించినట్లు వివరించాయి.

రూ. 22,805 కోట్ల ఈసీఎంఎస్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మే 1న దరఖాస్తులు ఆహ్వానించింది. ఎలక్ట్రానిక్‌ విడిభాగాల డిమాండ్‌కు తగ్గట్లుగా దేశీయంగా సరఫరాను పెంచేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. టాటా ఎల్రక్టానిక్స్, డిక్సన్‌ టెక్నాలజీస్, ఫాక్స్‌కాన్‌లాంటి సంస్థలు దీనిపై ఆసక్తి కనపర్చినట్లు సమాచారం.

విడిభాగాల సెగ్మెంట్లో 2030 నాటికి ఎల్రక్టానిక్స్‌ ఉత్పత్తి 500 బిలియన్‌ డాలర్లకు చేరనుండగా, డిమాండ్‌–సరఫరా మధ్య వ్యత్యాసం 248 బిలియన్‌ డాలర్లకు (సుమారు రూ. 21 లక్షల కోట్లు) చేరుతుందని ఎల్రక్టానిక్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అంచనా వేస్తోంది. దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు తగు చర్యలు తీసుకోకపోతే ఈ కొరతను అధిగమించేందుకు దిగుమతులపై ఆధారపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)