Breaking News

చమురు షేర్ల విలువ సరికాదు 

Published on Sun, 09/28/2025 - 06:17

ముంబై: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్‌ దిగ్గజాల(ఓఎంసీలు) షేర్ల విలువలపై కేంద్ర పెట్రోలియం, సహజవాయు శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురి తాజాగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. మార్కెట్లో వీటికి ఇన్వెస్టర్ల నుంచి లభిస్తున్న విలువపట్ల ప్రభుత్వం నిరాశకు లోనైనట్లు పేర్కొన్నారు. ఇండియన్‌ ఆయిల్‌(ఐవోసీ), హిందుస్తాన్‌ పెట్రోలియం(హెచ్‌పీసీఎల్‌), భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌(బీపీసీఎల్‌) ఉమ్మడిగా గత ఆరేళ్లలో రూ. 2.5 లక్షల కోట్ల నికర లాభం ఆర్జించినట్లు తెలియజేశారు.

 అయితే ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌ స్విగ్గీ, జొమాటో సంయుక్తంగా రూ. 24,000 కోట్ల నష్టాలు ప్రకటించినట్లు  ప్రస్తావించారు. అయితే మూడు ఓఎంసీల విలువతో ఈ రెండు కంపెనీల విలువ అటూఇటుగా సమానంగా ఉన్నట్లు వ్యాఖ్యానించారు. గతేడాది మూడు ఓఎంసీలు ఉమ్మడిగా ఆర్జించిన లాభాలు దేశీ కార్పొరేట్‌ లాభాల్లో 3.3 శాతం వాటాకు సమానమని పేర్కొన్నారు. అయితే వీటి విలువ 1 శాతానికంటే తక్కువేనని వెల్లడించారు. వెరసి చమురు మార్కెటింగ్‌ పీఎస్‌యూ షేర్లకు తగిన విలువ లభించడంలేదని అభిప్రాయపడ్డారు. 

వాటా విక్రయ యోచన 
ఇంధన విక్రయ దిగ్గజాలలో ప్రభుత్వం కొంతమేర వాటా విక్రయించేందుకు చూస్తున్నట్లు పురి తెలియజేశారు. అయితే వీటిలో పూర్తి వాటాను అమ్మివేసే యోచనలేదని స్పష్టం చేశారు. కంపెనీల సామర్థ్యాన్ని మెరుగుపరిచే దిశలో స్వల్ప వాటాను విక్రయించనున్నట్లు తెలియజేశారు. అయితే బీపీసీఎల్‌ ఈ జాబితాలో లేనట్లు స్పష్టం చేశారు.

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)