ఎయిర్‌పోర్ట్ నిర్వాహకులకు ఎయిర్‌లైన్స్ నిర్వహణ హక్కు?

Published on Wed, 07/22/2026 - 13:37

దేశీయ విమానయాన రంగంలో పోటీతత్వాన్ని పెంచేందుకు, ప్రయాణికులకు మరింత మెరుగైన అవకాశాలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన మార్పుపై కసరత్తు చేస్తోంది. విమానాశ్రయాలను నిర్మించి, నిర్వహించే ప్రైవేటు సంస్థలే స్వయంగా ఎయిర్‌లైన్స్ (విమానయాన సంస్థలు)ను కూడా స్థాపించేందుకు అనుమతించే ప్రతిపాదనను పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.

ప్రస్తుత నిబంధనలు.. ప్రతిపాదిత మార్పులు

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం.. ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాలను నిర్వహించే సంస్థలు ఏ ఎయిర్‌లైన్‌లోనూ 10 శాతానికి మించి ఈక్విటీ వాటా పొందేందుకు వీలులేదు. సొంత ప్రయోజనాలను అరికట్టేందుకు గతంలో ఈ నిబంధనను విధించారు. అయితే, ఇప్పుడు ఈ పరిమితులను సడలిస్తే ముంబై సహా 8 విమానాశ్రయాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూప్, ఢిల్లీ సహా పలు ఎయిర్‌పోర్ట్‌లను నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ వంటి దిగ్గజ సంస్థలకు సొంతంగా ఎయిర్‌లైన్స్ ప్రారంభించే మార్గం సుగమమవుతుంది.

ద్వంద్వ ఆధిపత్యంపై దెబ్బ!

గడిచిన దశాబ్దకాలంలో జెట్ ఎయిర్‌వేస్, గో ఫస్ట్ వంటి సంస్థలు మూతపడటం, టాటా గ్రూప్‌లో విస్తారా విలీనమవ్వడంతో భారత విమానయాన రంగం ప్రధానంగా రెండు ప్రధాన సంస్థల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇండిగో, ఎయిర్ ఇండియాలు కలిపి ప్రస్తుతం దేశీయ విమాన ప్రయాణికుల మార్కెట్‌లో ఏకంగా 90 శాతం సామర్థ్యాన్ని ఆక్రమించాయి. ఈ ద్వంద్వ ఆధిపత్యం వల్ల పోటీ తగ్గుతోందనే ఆందోళనలున్నాయి. కొత్త విధానం ద్వారా పెట్టుబడిదారులను ఆహ్వానించి మార్కెట్‌లో పోటీని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ ప్రతిపాదన పరిశ్రమ పరంగా సానుకూలమైనప్పటికీ అమలులో సవాళ్లు ఉన్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఎయిర్‌పోర్ట్ యజమానులే విమానాలను నడిపితే.. ప్రైమ్ ల్యాండింగ్/టేకాఫ్ స్లాట్‌ల కేటాయింపు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఛార్జీలు, టెర్మినల్ స్పేస్ వంటి కీలక అంశాల్లో సొంత ఎయిర్‌లైన్స్‌కే మొదటి ప్రాధాన్యత ఇచ్చుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

కేబినెట్ ఆమోదం తదుపరి అడుగు

ఈ విధాన సవరణ అమలులోకి రావడానికి న్యాయ మంత్రిత్వ శాఖ క్లియరెన్స్‌తో పాటు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించాల్సి ఉంది. 2047 నాటికి దేశంలో విమానాశ్రయాల సంఖ్యను 350కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న వేళ కేంద్రం తీసుకునే ఈ నిర్ణయం భారత పౌర విమానయాన భవిష్యత్తును మార్చే అవకాశముంది.

ఇదీ చదవండి: ఒక్కరోజులో ధరలు అమాంతం ఇలా..

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)