Breaking News

రూ.100 కాయిన్‌ విడుదల చేయనున్న కేంద్రం.. మనం వినియోగించవచ్చా?

Published on Sun, 04/23/2023 - 16:36

ఇప్పటి వరకు మనం రూ. 1,2,5,10, 20 కాయిన్స్‌ చూశాం. వాటిని వినియోగించాం. అయితే త్వరలో భారత మార్కెట్‌లో రూ.100 నాణేలు విడుదల కానున్నాయి. ఈ కొత్త కాయిన్‌ వినియోగంపై కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

ప్రధాని మోదీ 2014 అక్టోబర్ 3న ‘మన్‌ కీ బాత్‌’ (మనసులో మాట) పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రతి నెల చివరి ఆదివారంలో ఆల్ ఇండియా రేడియలో మోదీ ప్రసంగిస్తారు. ఇప్పటి వరకు 99 కార్యక్రమాలు పూర్తికాగా.. 100వ ఎపిసోడ్‌ సందర్భంగా ప్రధాని మోదీ రూ.100 నాణేలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో రూ.100 కాయిన్‌ విడుదలపై కేంద్ర ఆర్ధిక శాఖ అధికారిక ప్రకటన చేసింది. ఈ వంద రూపాయిల నాణెం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తయారైంది. ఈ విలువైన నాణెం కేంద్రం ప్రభుత్వం నిర్వహిస్తున్న 100 ఎపిసోడ్‌ మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.

రూ.100 కాయిన్‌ను వినియోగించుకోవచ్చా? 
ఏప్రిల్‌ 30న జరిగే మన్‌కీ బాత్‌ 100 ఏపీసోడ్‌ సందర్భంగా రూ.100 కాయిన్‌ను కేంద్రం విడుదల చేయనుంది. విడుదల అనంతరం దీనిని సాధారణ కాయిన్‌లాగా వినియోగించేందుకు వీలు లేదు. కేవలం ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలు మాత్రమే  ఉపయోగించుకునే వెసలు బాటు కల్పించింది కేంద్రం. 

రూ.100 కాయిన్‌ ప్రత్యేకతలు 
కేంద్రం ఆర్ధిక శాఖ అధికారిక ప్రకటన మేరకు.. రూ.1, 2,10,20 నాణెల కంటే విభిన్నంగా ఉండనుంది. కాయిన్‌ 44 మిల్లీమీటర్‌ డయారీ మీటర్‌లో గుండ్రంగా ఉంటుంది. ఇందులో 35 గ్రాముల ఇనుము, వెండి 50శాతం,రాగి 40 శాతం, నికెల్‌ 5శాతం, జింక్‌ శాతం కలిగి ఉంటుంది. వీటితో పాటు అశోక స్తంభము ముద్ర, మధ్యలో సత్యమేవ జయతే, దేవనగరి భాషలో భారత్‌ అనే పదాలు కనిపిస్తాయి. ఎడమవైపు ఇంగ్లీష్‌లో ఇండియా అనే అక్షరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అదనంగా కాయిన్‌ మీద రూపాయి చిహ్నం "₹" 100 సంఖ్య ఉండగా.. నాణెం వెనుక భాగంలో  మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ లోగో, దానిపై '2023' అని రాయబడి ఉంటుంది. 

చదవండి👉 ట్విటర్‌ యూజర్లకు శుభవార్త!

#

Tags : 1

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)