Breaking News

కృత్రిమ మేధను నియంత్రించవచ్చా..?

Published on Wed, 04/16/2025 - 12:10

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు వీటి నైతికత, భద్రత, సృజనాత్మక పరిధి, ఆర్థిక వృద్ధిని ఎలా సమతుల్యం చేయాలో తర్జనభర్జన పడుతున్నాయి. ఇప్పటివరకు కొన్ని దేశాల్లోనే ఏఐ గవర్నెన్స్‌కు సంబంధించిన స్పష్టమైన విధానాలున్నాయి. సామాజిక భద్రత, మానవ హక్కులు, ఆర్థిక శ్రేయస్సుకు ప్రాధాన్యమిస్తూ కృత్రిమ మేధను నియంత్రించడానికి ఖచ్చితమైన చట్టాలను అమలు చేస్తున్నాయి. ఇంకొన్ని దేశాలు వ్యూహాత్మక విధాన ఫ్రేమ్‌వర్క్‌లతో ముసాయిదా చట్టాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.

ఏఐ నియంత్రణపై ‍ప్రపంచ దేశాలు ఇలా..

  • చైనా ఏఐ అల్గారిథమ్‌ల్లో పారదర్శకత, డేటా గోప్యత, ఎథికల్‌ ఏఐ విధానాలను అమలు చేయడంపై దృష్టి సారించే నిబంధనలను ప్రవేశపెడుతుంది. ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, అటానమస్ సిస్టమ్స్ వంటి రంగాల్లో ఈమేరకు చర్యలు తీసుకుంటోంది.

  • యూరోపియన్ యూనియన్(ఈయూ) ఇప్పటికే ఏఐ చట్టాన్ని అమలు చేస్తుంది. సామాజిక భద్రత, పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించే లక్ష్యంతో హైరిస్క్ అప్లికేషన్లపై కఠినమైన నిబంధనలను విధిస్తుంది.

  • కెనడాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా యాక్ట్ (ఏఐడీఏ) బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తుంది.

  • దక్షిణ కొరియా నైతిక కృత్రిమ మేధ కోసం మార్గదర్శకాలను అమలు చేస్తుంది. కృత్రిమ మేధ భద్రత, జవాబుదారీతనాన్ని నియంత్రించడానికి చట్టాన్ని అభివృద్ధి చేస్తోంది.

  • పెరూ ప్రభుత్వ సేవల్లో నైతిక ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి, పౌరుల హక్కులను పరిరక్షించడానికి నిబంధనలు ప్రవేశపెట్టింది.

  • అమెరికా కృత్రిమ మేధ విధానంలో మాత్రం మార్పు వచ్చింది. బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చేలా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025లో రద్దు చేశారు.

  • యునైటెడ్ కింగ్‌డమ్‌, జపాన్, బ్రెజిల్, కోస్టారికా, కొలంబియాతో సహా అనేక దేశాలు తమ చట్టసభలలో ఆమోదం కోసం కృత్రిమ మేధ బిల్లులను రూపొందించాయి.

ఇదీ  చదవండి: రైలులో ఏటీఎం.. కొత్త సర్వీసు

ఏఐ స్ట్రాటజీ డాక్యుమెంట్లు

సమ్మిళిత, సుస్థిర వృద్ధిని నిర్ధారించేందుకు, సామాజిక ఆర్థిక ప్రగతిని నడిపించడానికి ఏఐ వినియోగంపట్ల దేశాల ధోరణి ఎలా ఉందనేది నేషనల్‌ ఏఐ స్ట్రాటజీ డాక్యుమెంట్లు తెలియజేస్తాయి. ప్రస్తుతానికి అధికారిక చట్టాలు పరిమితంగా ఉన్నప్పటికీ ఏఐ పాలనకు మరింత విస్తృతమైన విధానాలు తీసుకువచ్చేందుకు ఈ డాక్యుమెంట్లు తోడ్పడుతాయి. ఆఫ్రికన్ యూనియన్‌తో పాటు సుమారు 85 దేశాలు ఇలాంటి వ్యూహాలను ప్రచురించాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పత్రాల్లో ప్రధానంగా కింది విషయాలు పొందుపరిచారని తెలిపారు.

  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్, డెవలప్‌మెంట్‌, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించడం.

  • హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ట్రాన్స్‌పోర్ట్‌ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఏకీకృతం చేయడానికి కాలపరిమితి, ప్రాధాన్యాలను నిర్దేశించడం.

  • నిష్పాక్షికత, పారదర్శకత, జవాబుదారీతనం వంటి బాధ్యతాయుతమైన ఏఐ అభివృద్ధికి మార్గనిర్దేశం చేయడానికి సూత్రాలను ఏర్పాటు చేయడం.

  • ఏఐ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు పౌరులను సిద్ధం చేయడానికి కావాల్సిన విద్యను ప్రోత్సహించడం.

  • ఏఐ భద్రత, ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి భాగస్వామ్యాలు తోడ్పాటు అందించడం.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?