నెలకు రూ.7.5 లక్షల జీతం.. మూడునెలల్లో వదిలేసాడు!

Published on Thu, 11/13/2025 - 15:47

చాలామంది ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం చేయాలని కలలు కంటారు. అలాంటి అవకాశం వస్తే బాగుంటుందని ఎదురు చూస్తారు. కానీ నెలకు రూ.7.5 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఒక వ్యక్తి వదులుకుని.. బెంగళూరులోని గూగుల్‌ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. దీనికి కారణం ఏమిటి?, ఇతరత్రా వివరాలను ఈ కథనంలో చూసేద్దాం.

బెంగళూరులోని గూగుల్‌లో.. ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్న టెక్నీషియన్ 'అడ్వైన్ నెట్టో' యూఏఈలోని అబుదాబిలో అధిక జీతం వచ్చే ఉద్యోగాన్ని మూడు నెలల్లోనే వదులుకుని భారతదేశానికి ఎందుకు తిరిగి వచేసాడు. ఈ విషయాన్ని అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పేర్కొన్నారు.

అడ్వైన్ నెట్టో ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. నెలకు రూ.7.5 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని ఆరు సంవత్సరాలకు ముందు వదిలిపెట్టేశాను అని పేర్కొన్నాడు. యూఏఈ వర్క్ వీసా రావడానికి దాదాపు ఐదు నెలలు పట్టింది. కానీ మూడు నెలల్లోనే ఉద్యోగన్ని వదిలేశాను. ఎక్కువ పనిగంటలు, ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు పంచ్ వేయకపోతే.. సగం రోజు జీతం కట్ అవుతుంది.

మౌలిక సదుపాయాలు, భౌతిక అభివృద్ధిలో యూఏఈ చాలా అద్భుతంగా ఉంది. కానీ డిజిటల్ రంగంలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఇంకా అభివృద్ధి చెందలేదు. ఇక్కడ డబ్బు సమస్య కాదు. అత్యున్నత పదవులు అర్హత కంటే.. జాతీయతపై ఆధారపడి ఉన్నాయని, దీనివల్ల నిజమైన నైపుణ్యం వృద్ధి చెందడం కష్టమైందని పేర్కొన్నారు.

నేను యూఏఈలో నెలకు నెలకు 30000 AED సంపాదించడం చాలా పెద్దదిగా అనిపించవచ్చు. కానీ అక్కడ హాయిగా జీవించడానికి, సులభంగా 10000 AED ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే యూఏలో నెలకు 20000 AEDలను పొదుపుచేయగలిగాను. ఎంత సంపాదించిన అక్కడి పని వాతావరణం ఇబ్బందిగా అనిపించింది. 

ఇదీ చదవండి: ఎయిర్ పొల్యూషన్ ఎఫెక్ట్: అమల్లోకి కొత్త రూల్!

నా పరిస్థితిని వెల్లడించినప్పుడు.. నువ్వు కంపెనీని మార్చి ఉండవచ్చు, దేశాన్ని (యూఏఈ) ఎందుకు వదిలి వెళ్లావని కొంతమంది స్నేహితులు అన్నారు. అలా కూడా ట్రై చేసాను. కొంతమంది సన్నిహితులను అడిగాను. వాళ్ల పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది. అంతే కాకుండా కొందరు వారానికి ఆరు రోజులు పనిచేస్తున్నట్లు చెప్పారు. కాబట్టే ఆ దేశంలో ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చిందని అడ్వైన్ నెట్టో పేర్కొన్నారు.

#

Tags : 1

Videos

Madanapalle: యమునకు ఒక కిడ్నీ తొలగించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి

Ambati: ధర్మారెడ్డి విచారణపై ABN, TV5 పిచ్చి వార్తలు...

Global Silence: 8 లక్షల మంది బలి

Nidadavolu: టీడీపీ బెల్ట్ షాపుల దందా.. బాటిల్‌పై అదనంగా రూ.30 వసూలు

ReNew సంస్థను రాష్ట్రం నుంచి పంపేసారంటూ లోకేష్ పచ్చి అబద్ధాలు

విజయవాడలో నడిరోడ్డుపై దారుణహత్య

అంకాలమ్మ గూడూరు గ్రామ రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: వైఎస్ అవినాష్

Sudha Madhavi: నన్ను బెదిరించి వీడియో రికార్డు చేశారు..!

తిరుపతిలో ప్రజా ఉద్యమం చూసి బిత్తరపోయిన పోలీసులు

పవన్ కల్యాణ్‌కు ఎంపీ మిథున్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

జూబ్లీహిల్స్‌లో కొనసాగుతున్న కౌంటింగ్‌.. అభ్యర్థులు, ఏజెంట్లు బిజీ (ఫొటోలు)

+5

ఫ్రెషర్స్‌ డే పార్టీ.. అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

బీచ్ ఒడ్డున సంయుక్త.. ఇంత అందమా? (ఫొటోలు)

+5

భర్త బర్త్ డే.. సుమ క్యూట్ పోస్ట్ (ఫొటోలు)

+5

SSMB29 లోకేషన్‌కి ట్రిప్ వేసిన అనసూయ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ అంజలి (ఫొటోలు)

+5

లేటు వయసులో ట్రెండింగ్ అయిపోయిన గిరిజ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్‌ మీట్‌.. ముఖ్య అతిథిగా విజయ్‌ (ఫొటోలు)

+5

‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ గ్రాండ్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఘనంగా కోటి దీపోత్సవం..హాజరైన వీసీ సజ్జనార్ (ఫొటోలు)