Breaking News

యూజర్లకు పెద్ద దెబ్బే .. మరో సర్వీస్‌ను షట్‌డౌన్‌ చేయనున్న గూగుల్‌!

Published on Fri, 01/12/2024 - 21:41

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపారస్థులకు లాభదాయకంగా ఉండే గూగుల్‌ బిజినెస్‌ ప్రొఫైల్‌ వెబ్‌సైట్‌ను శాస్వతంగా షట్‌డౌన్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. 

మార్చి నెలలో ఈ వెబ్‌సైట్‌ను తొలగిస్తున్నట్లు తెలిపింది. అనంతరం ఎవరైనా ఈ బిజినెస్‌ ప్రొఫైల్‌ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేస్తే డైరెక్ట్‌గా కస్టమర్ల బిజినెస్‌ ప్రొఫైల్‌లోకి వెళ్తారని పేర్కొంది. 


 
గూగుల్‌ బిజినెస్‌ ప్రొఫైల్ అంటే ఏమిటి?
గూగుల్‌ బిజినెస్‌ ప్రొఫైల్ అనేది గూగుల్‌ సెర్చ్‌, మ్యాప్స్‌లో వారి వ్యాపారానికి సంబంధించిన అడ్రస్‌లు డిస్‌ప్లే చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని గూగుల్‌ వ్యాపారాలు నిర్వహించే వారికి ఉచితంగా అందిస్తుంది. బిజినెస్‌ ప్రొఫైల్‌తో వినియోగదారులు కస్టమర్‌లతో కనెక్ట్ అవ్వవచ్చు. అప్‌డేట్‌లను పోస్ట్ చేయవచ్చు. వారి ప్రొడక్ట్‌లు, అందిస్తున్న సేవల గురించి చెప్పొచ్చు.  

ప్రత్యామ్నాయం ఏంటి?
గూగుల్‌ బిజినెస్‌ ప్రొఫైల్‌ షట్‌డౌన్‌ అవుతుంది. మరి దీనికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటనే అంశంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో గూగుల్‌ బిజినెస్‌ ప్రొఫైల్‌ను వినియోగించే బదులు సొంతంగా కొత్త వెబ్‌సైట్‌ను తయారు చేసుకోవడంతో పాటు అందులో మీ బిజినెస్‌ అడ్రస్‌తో పాటు బిజినెస్‌ ప్రొఫైల్‌ను అప్‌డేట్‌ చేసుకోవడం మంచిదని గూగుల్‌ యూజర్లకు సూచించింది. 
 

Videos

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)