Breaking News

గూగుల్‌ కొత్త ఫీచర్‌.. కొట్టేసిన ఫోన్‌ పనిచేయదు!

Published on Fri, 05/16/2025 - 17:33

ఫోన్ల చోరీకి చెక్‌ పెట్టేందుకు గూగుల్‌ కొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. చోరీకి గురైన ఫోన్లను దాదాపు నిరుపయోగంగా మార్చే లక్ష్యంతో గూగుల్ ఆండ్రాయిడ్ 16తో ముఖ్యమైన యాంటీ-థెఫ్ట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ అప్‌డేట్‌లో మెరుగైన భద్రతా సాధనాలు ఉంటాయి. ఇవి "ఓనర్‌ అనుమతి లేకుండా రీసెట్ చేసిన ఫోన్‌లు పనిచేయకుండా అవుతాయి" అని ఆండ్రాయిడ్ పరికరాల సమాచారాన్ని తెలిపే ‘ఆండ్రాయిడ్‌ పోలీస్’ అనే వెబ్‌సైట్‌ నివేదిక తెలిపింది.

గూగుల్‌ ఇటీవల 'ది ఆండ్రాయిడ్ షో: ఐ/ఓ ఎడిషన్' సందర్భంగా ఈ కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించింది. ఇది ప్రాథమికంగా ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్ (ఎఫ్ఆర్‌పీ) ను పెంచుతుంది. ఇది చోరీకి గురైన ఫోన్లను నిరుపయోగంగా చేయడానికి రూపొందించిన భద్రతా ఫీచర్. గూగుల్ ఆండ్రాయిడ్ 15 లో ఎఫ్ఆర్‌పీకి అనేక మెరుగుదలలు చేసింది. తదుపరి ఆండ్రాయిడ్ అప్డేట్ దీనిని మరింత బలోపేతం చేస్తుంది.

ఈ కొత్త ఫీచర్ గురించి గూగుల్ అధికారికంగా ఏమీ చెప్పనప్పటికీ, గూగుల్ ప్రణాళికలను తెలియజేసే ఒక స్క్రీన్ షాట్ ను ఆండ్రాయిడ్ పోలీస్ పబ్లిష్‌ చేసింది. ఈ స్క్రీన్ షాట్ ఫోన్ స్క్రీన్ పై ఫ్యాక్టరీ రీసెట్ వార్నింగ్ ఫ్లాషింగ్ ను చూపిస్తోంది. ఫోన్‌ను దొంగిలించినవారు ఒకవేళ సెటప్ విజార్డ్ ను చేయకపోతే రీసెట్‌ చేయకుండా ముందుకెళ్లలేరు. అంటే యూజర్‌ ఫోన్‌ను రీసెట్ చేసి మునుపటి లాక్ స్క్రీన్ లాక్ లేదా గూగుల్ ఖాతా క్రెడెన్షియల్స్‌ను నమోదు చేసే వరకు ఫోన్‌ పనిచేయదు. ఆండ్రాయిడ్ పోలీస్ ప్రకారం.. కొత్త ఫీచర్‌ ఈ సంవత్సరం చివరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)