Breaking News

వాట్సప్‌ లేకున్నా లొకేషన్‌ షేర్‌ చేయండిలా..

Published on Wed, 01/03/2024 - 13:56

మనం వెళుతున్న ప్రాంతాలకు రూట్‌ తెలియకపోతే వెంటనే అప్పటికే అక్కడ ఉంటున్న వారిని లొకేషన్‌ షేర్‌ చేయమని అడుగుతూంటాం. వారు వెంటనే వాట్సప్‌లో లొకేషన్‌ షేర్‌ చేస్తారు. దాని ఆసరాగా చేసుకుని గమ్యం చేరుతాం. కానీ కొన్నిసార్లు వాట్సప్‌తోపాటు ఇతర లొకేషన్‌ షేరింగ్‌ యాప్‌లు పనిచేయకపోతే ఎలా.. అసలు వాట్సప్‌ వాడని వారు ఎలా వారి లొకేషన్‌ షేర్‌ చేయాలి.. అనే అనుమానం వచ్చిందా. అయితే అలాంటి వారికోసం గూగుల్‌ మనం వెళ్లే రూట్లు, షార్ట్ కట్ మార్గాలను తెలుసుకోవడానికి తన గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

రూట్ మ్యాప్‌పై రియల్ టైం లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను అందిస్తుంది. ఇప్పటివరకు రియల్ టైం లొకేషన్ షేర్‌ చేయాలంటే తప్పనిసరిగా వాట్సప్‌ వంటి మరో యాప్ మీద ఆధార పడాల్సిందే. ఇక నుంచి ఇటువంటి ఇబ్బందులకు తెర దించుతూ గూగుల్ మ్యాప్స్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సాయంతో ఏ ఇతర యాప్స్ లేకుండా కేవలం సాధారణ మెసేజ్‌తో రియల్ టైం లొకేషన్ షేర్ చేయొచ్చు.

ఇదీ చదవండి: మస్క్‌ చేతికి వొడాఫోన్‌ ఐడియా..? క్లారిటీ ఇచ్చిన టెలికాం సంస్థ

ఈ ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు గూగుల్‌ మ్యాప్స్‌ యాప్‌లో లాగిన్‌ అవ్వాలి. ఫ్రొఫైల్‌ అకౌంట్‌పై క్లిక్‌ చేసి అందులో లొకేషన్‌ షేరింగ్‌ ఆప్షన్‌ ఎంచుకోవాలి. స్క్రీన్‌పై కనిపిస్తున్న న్యూ షేర్‌పై క్లిక్‌ చేసి సమయాన్ని సెట్‌ చేసుకోవచ్చు. లేదా ‘అంటిల్‌ యు టర్న్‌ దిస్‌ ఆఫ్‌’ ఆప్షన్‌ ఎంచుకొని కాంటాక్ట్‌ సెలెక్ట్‌ చేసుకొని మెసేజ్‌ పంపించాలి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)