Breaking News

ఆల్ఫాబెట్, అమెజాన్‌ల పంట పండించిన స్టార్టప్‌

Published on Mon, 11/03/2025 - 11:26

టెక్ దిగ్గజాలు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, అమెజాన్ ఇటీవల ప్రకటించిన తమ మూడో త్రైమాసికం (క్యూ3) లాభాల్లో అద్భుతమైన వృద్ధి సాధించాయి. దీనికి ప్రధాన కారణం ఈ రెండు కంపెనీలు ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్‌లో చేసిన పెట్టుబడులు గణనీయంగా పెరగడమే. క్లాడ్ చాట్‌బాట్ సర్వీసులు అందిస్తున్న ఆంత్రోపిక్ లాభాలు పెరగడం ఈ కంపెనీలకు కలిసొచ్చింది.

క్యూ3లో భారీ లాభాలు

గత వారం వెలువడిన ఫలితాల ప్రకారం ఆల్ఫాబెట్ తన లాభంలో ఈక్విటీ సెక్యూరిటీలపై నికరంగా 10.7 బిలియన్‌ డాలర్లు సంపాదించినట్లు తెలిపింది. ఇందులో ప్రధానంగా ఆంత్రోపిక్ వాటా విలువ పెరిగినట్లు చెప్పింది. ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ క్యూ3 లాభం 38% పెరిగింది. ఆంత్రోపిక్‌లో దాని పెట్టుబడి నుంచి వచ్చిన 9.5 బిలియన్‌ డాలర్లు నాన్-ఆపరేటింగ్ ఆదాయంలో ప్రతిబింబించింది.

ఆంత్రోపిక్ అందించే సేవలు

క్లాడ్ (Claude) - జనరేటివ్‌ ఏఐ అసిస్టెంట్

క్లాడ్ అనేది ఆంత్రోపిక్ ప్రధాన ఉత్పత్తి. ఇది నెక్స్ట్ జనరేషన్ ఏఐ అసిస్టెంట్. దీన్ని సంభాషణాత్మక, టెక్స్ట్ ప్రాసెసింగ్ పనుల కోసం రూపొందించారు. ఇది లార్జ్‌ డాక్యుమెంట్లు లేదా సంభాషణల సారాంశాన్ని అందిస్తున్నారు. కథనాలు, కంటెంట్, కోడ్ రాయడంలో సహాయం చేస్తుంది. రాసిన కోడింగ్‌ను డీబగ్గింగ్ చేస్తుంది. ఇది చాట్ ఇంటర్‌ఫేస్ ద్వారా (Claude.ai), డెవలపర్ల కోసం ఏపీఐ ద్వారా అందుబాటులో ఉంది.

ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)