Breaking News

కొత్త జీఎస్టీ అమలు.. వైఎస్‌ జగన్‌ స్పందన

Published on Mon, 09/22/2025 - 11:54

జీఎస్టీ కొత్త శ్లాబులు ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించారు. జీఎస్టీ క్రమబద్ధీకరణ సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగుగా అభివర్ణించారు. సామాన్య ప్రజానీకానికి ఈ నిర్ణయం వల్ల ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో తన అభిప్రాయాన్ని పోస్ట్‌ చేశారు.

‘జీఎస్టీ పునర్నిర్మాణం సరళమైన, న్యాయమైన పన్ను వ్యవస్థ వైపు ఒక విప్లవాత్మక అడుగు. వస్తువులు, సేవలను ప్రతి పౌరుడికి మరింత సరళంగా, సరసమైనదిగా మార్చడానికి ఈ చర్యలు ఎంతో తోడ్పడుతాయి. ప్రాథమికంగా కొన్ని ఫిర్యాదుల నిర్వహణలో లోపాలు ఉండొచ్చు. కానీ ఇది ఒక ప్రక్రియ. దీని ప్రయోజనాలు తుది వినియోగదారులకు చేరుకుంటాయని నేను ఆశిస్తున్నాను. ఇది కచ్చితంగా ఆర్థిక వ్యవస్థలో వినియోగానికి, మరింత పెట్టుబడులకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది’ అని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

ఇక 12 శాతం; 28 శాతం ఉండవు..

సేల్స్‌ట్యాక్స్, వ్యాట్, సెంట్రల్‌ ఎక్సైజ్, సర్వీస్‌ ట్యాక్స్‌ సహా పలు రకాల పరోక్ష పన్నులన్నిటినీ తొలగిస్తూ 2017 జులై నుంచీ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌ (జీఎస్‌టీ) అమల్లోకి వచ్చింది. తక్కువ పన్నురేట్లుండాలని మొదట లక్ష్యించినా సాధ్యం కాలేదు. తాజా సవరణలతో అది సాధ్యమై జీఎస్‌టీ శ్లాబ్‌లు 3కు తగ్గాయి. తక్కువ శ్లాబ్‌లుంటే పాలన, ధరల నిర్ణయం, బిల్లింగ్‌ సులువవుతుంది. పన్ను అధికారులపైనా భారం తగ్గుతుంది. జీఎస్‌టీ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత ప్రధానమైనది.. 12 శాతం, 28 శాతం పన్ను రేట్లను పూర్తిగా తొలగించటం.

కొన్ని విలాస, అనారోగ్య (సిన్‌) వస్తువుల కోసం 40 శాతం పన్ను రేటును చేర్చటం. వాస్తవంగా చూస్తే చాలావరకూ ఆహార పదార్థాలు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌ 5% పరిధిలోకి వచ్చాయి. కొన్నింటిపై పన్నే లేకుండా చేశారు. గతంలో వీటిపై 12, 28 శాతం పన్ను రేట్లుండేవి. ఇది అత్యధికులకు ఊరటే. ఇక కొన్ని విలాస వస్తువులు, కూల్‌డ్రింక్స్, టొబాకో ఉత్పత్తులు, పాన్‌ మసాలా వంటివి మాత్రం 28 శాతం పన్ను పరిధిలో ఉండగా ఇపుడు 40 శాతం శ్లాబ్‌లోకి వెళ్లాయి.

ఇదీ చదవండి: ఏఐతో ఊడ్చుకుపోయే ఉద్యోగాలు ఇవే..

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి