Breaking News

నా అంచనా తప్పింది.. కియోసాకి ట్వీట్!

Published on Mon, 06/29/2026 - 16:12

బంగారం, వెండి ధరలు పెరుగుతాయని సూచించే రాబర్ట్ కియోసాకి.. ఇప్పుడు ధరలు తగ్గుతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

తాను బంగారం ధరల విషయంలో చేసిన అంచనా తప్పిందని, ధరలు ఇంకా తగ్గిపోతాయని కియోసాకి నిజాయితీగా అంగీకరించారు. అయితే.. మార్కెట్లు ఎప్పుడూ ఒకే దిశలో కదలవని, పెరుగుదలతో పాటు పతనం కూడా సహజమేనని పేర్కొన్నారు. బంగారం ధరలు వరుసగా తగ్గుతున్న వేళ ఈ ట్వీట్ చేశారు.

పెట్టుబడుల్లో అసలు లాభం అమ్మే సమయంలో కాకుండా, సరైన సమయంలో కొనుగోలు చేసినప్పుడే ఏర్పడుతుందని కియోసాకి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గుతున్నప్పటికీ, రాబోయే ఐదేళ్లలో అవి 35 వేల డాలర్ల (ఔన్సు) స్థాయికి చేరుతాయని తెలిపారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులు పెట్టే వారే నిజమైన సంపదను సృష్టించగలరని, రోజువారీ ధరల మార్పులను చూసి నిర్ణయాలు తీసుకోవడం సరైన విధానం కాదని సూచించారు.

అంతే కాకుండా.. తప్పులు చేయడం సహజమని, వాటి నుంచి పాఠాలు నేర్చుకోవడమే విజయానికి దారి తీస్తుందని చెప్పారు. ఎలాంటి తప్పులు చేయని వారు కొత్త విషయాలు నేర్చుకోలేరని, పెట్టుబడిదారులు ఓర్పు, దీర్ఘకాలిక ఆలోచన, అనుభవాల నుంచి నేర్చుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.

భారతదేశంలో బంగారం ధరలు
మన దేశంలో బంగారం ధరల తగ్గుదల కొనసాగుతూనే ఉంది. ఈ రోజు (జూన్ 29) కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు వరుసగా రూ.850 (22 క్యారెట్స్), రూ.930 (24 క్యారెట్స్) తగ్గింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో పసిడి ధరలు కొంత పతనమయ్యాయి.

Videos

నిప్పుల కొలిమిగా యూరప్... పిట్టలా రాలిపోతున్న జనాలు!

2029లో మీరు రాజారెడ్డి మనవడిని చూస్తారు..! ఒక్కొక్కడికీ ఊచకోతే..!

జులైలో వానలు! విశాఖ IMD గుడ్ న్యూస్

YS జగన్ ను కలిసిన సింగపూర్ కాన్సులేట్ జనరల్

కేతన్ హత్య కేసులో బయటపడుతున్న కీలక ఆధారాలు.. మరో సంచలన ట్విస్ట్!

మినిమం కామన్ సెన్స్ లేదా... ఏమ్మా హోమ్ మినిస్టర్, ఏం చేస్తున్నావ్..!

High Tension: చంద్రబాబు ఇంటిని ముట్టడి బారు గేట్లు లాగిపడేసిన రైతులు

సాయికృష్ణ కేసులో RMP డాక్టర్ చెప్పిన నమ్మలేని నిజాలు

ఫేస్ యాప్ దుర్వినియోగం? ఉపాధి హామీలో టీడీపీ అక్రమాలు

రికార్డులు బద్దలు కొట్టిన సమంత.. అనుష్కను దాటేసింది!

Photos

+5

అక్కినేని అఖిల్‌ ‘లెనిన్‌’ మూవీ HD స్టిల్స్‌

+5

‘హ్యాంగ్‌మ్యాన్’ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘ఆల్ఫా’ మూవీ ప్రమోషన్‌లో సందడి చేసిన అలియా భట్ (ఫొటోలు)

+5

గ్లామరస్‌గా సింగ్ గీతం బ్యూటీ నివేదా పేతురాజ్.. (ఫోటోలు)

+5

రొట్టెల పండగ : స్వర్ణాల తీరం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

అందాల అదితీ రావు హైదరీ (ఫొటోలు)

+5

రకుల్.. అదిరెన్ నీ సొగసులు! (ఫొటోలు)

+5

లార్డ్స్ మైదానంలో సందడి చేసిన కోహ్లి-ధావన్ ఫ్యామిలీస్! (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో హీరోయిన్ మధుబాల స్పెషల్ మూమెంట్స్ (ఫొటోలు)

+5

బాలీవుడ్ భామ ప్రగ్యా కపూర్ బర్త్‌ డే.. తమన్నా సందడి (ఫోటోలు)