Breaking News

Gold Prices: ఆగని పసిడి పరుగు

Published on Wed, 02/05/2025 - 03:38

న్యూఢిల్లీ: జ్యుయలర్లు, రిటైలర్ల నుంచి  డిమాండ్‌ పెరగడంతో పసిడి పరుగు కొనసాగుతోంది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో వరుసగా అయిదో సెషన్‌లో లాభపడి రూ. 86,000కు మరింత చేరువైంది. 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర మరో రూ. 500 పెరిగి రూ. 85,800కి చేరిందని ఆలిండియా సరాఫా అసోసియేషన్‌ తెలిపింది. జనవరి 1 నుంచి ఈ ఏడాది ఇప్పటి వరకు పసిడి ధర ఏకంగా 8 శాతం పైగా ఎగిసిందని, రూ. 6,410 మేర పెరిగిందని వివరించింది.

అటు వెండి ధరల విషయానికొస్తే అయిదు రోజుల ర్యాలీకి బ్రేక్‌ వేస్తూ మంగళవారం కేజీకి రూ. 500 తగ్గి రూ. 95,500కి పరిమితమైంది. మరోవైపు, టారిఫ్‌లపై అమెరికా, కెనడా, మెక్సికో మధ్య చర్చలు జరుగుతుండటంతో పసిడి ర్యాలీ కాస్త నెమ్మదించవచ్చని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ వీపీ జతిన్‌ త్రివేది తెలిపారు. ఎంసీఎక్స్‌ ఫ్యూచర్స్‌ మార్కెట్లో ఏప్రిల్‌ డెలివరీ కాంట్రాక్టు ఒక దశలో రూ. 208 తగ్గి రూ. 83,075 వద్ద ట్రేడయిందని వివరించారు.  అటు అంతర్జాతీయంగాను పసిడి రికార్డు పరుగు కొనసాగుతోంది. ఫ్యూచర్స్‌ మార్కెట్లో ఔన్సు (31.1 గ్రాముల) ధర ఒక దశలో 2,876 డాలర్లకు ఎగిసింది. 

#

Tags : 1

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)