పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ జెండా ఊపిన ప్రధాని
Breaking News
సిల్వర్ స్పీడుకు బ్రేక్
Published on Fri, 01/23/2026 - 04:46
న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో పసిడి, వెండి ధరల పరుగుకు కాస్త బ్రేక్ పడింది. ఆలిండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం గురువారం న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛమైన పుత్తడి 10 గ్రాముల ధర రూ. 2,500 తగ్గి రూ. 1,57,200 వద్ద ముగిసింది. అటు తొమ్మిది రోజుల పాటు ర్యాలీ చేసిన వెండి ధర కిలోకి రూ. 14,300 క్షీణించి రూ. 3,20,000కి పరిమితమైంది.
రికార్డు బ్రేకింగ్ ర్యాలీల తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో బంగారం, వెండి ధరల్లో కరెక్షన్ వచ్చినట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. యూరప్ దేశాలపై టారిఫ్‌ల బెదిరింపులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తీసుకున్న నేపథ్యంలో రెండు మెటల్స్ కాస్త నెమ్మదించినట్లు వివరించారు.
భౌగోళిక–రాజకీయ రిసు్కలపై ఆందోళన కొంత తగ్గడంతో దేశీ మార్కెట్లలో పాక్షికంగా లాభాల స్వీకరణ చోటు చేసుకున్నట్లు ఎల్‌కేపీ సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ జతిన్ త్రివేది తెలిపారు. అటు అంతర్జాతీయంగా స్పాట్ మార్కెట్లో పసిడి ఔన్సు (31.1 గ్రాములు) ధర 8.80 డాలర్లు తగ్గి 4,822.65 వద్ద ట్రేడయ్యింది. వెండి మాత్రం 0.27 శాతం పెరిగి 93.36 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు, బ్యాంక్ ఆఫ్ జపాన్ మానిటరీ పాలసీ నిర్ణయాల వెల్లడికి ముందు ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని, దీంతో పసిడి, వెండి రేట్లలో హెచ్చుతగ్గులు చోటు చేసుకునే అవకాశం ఉందని కోటక్ సెక్యూరిటీస్ ఏవీపీ కాయ్‌నాత్ చైన్‌వాలా తెలిపారు.
Tags : 1