Breaking News

తక్షణం తగ్గినా.. భవిత ‘బంగారమే’!

Published on Thu, 07/25/2024 - 04:33

పుత్తడిపై కస్టమ్స్‌ సుంకాలు  15% నుంచి 6%కి తగ్గిస్తున్నట్లు వార్షిక బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన వెంటనే ఇటు స్పాట్‌లో అటు ఫ్యూచర్స్‌ మార్కెట్లలో రూ.4,000 వరకూ పడిపోయిన పసిడి ధరలు.. ఇదే రీతిలో ముందు ముందు  ఆభరణ ప్రియులకు అంతే సంతోషాన్ని కలిగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ అంశాలతో పాటు దేశీయంగా రూపాయి విలువ పతనం ఇందుకు కారణం.

→ భౌగోళిక ఉద్రిక్తతలను మొదట ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రష్యా–ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు, దీనికి పశ్చిమ దేశాల మద్దతు అలాగే చైనాతో అమెరికాకు ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితికి దారితీసే అంశాలు. ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొన్నా.. పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్‌ బంగారం వైపే చూస్తాడనడంలో సందేహం లేదు.  

→ ఇక రెండో అంశానికి వస్తే.. అమెరికాతో సహా పలు దేశాలు సరళతర వడ్డీరేట్ల విధానంలోకి మారినప్పటికీ ఆ విధానాన్ని ఎంతవరకూ కొనసాగిస్తాయో తెలియని పరిస్థితి. సరళతర వడ్డీరేట్ల విధానంతో బంగారంలో కొనుగోళ్లు పెరుగుతాయి. అయితే ఈ విధానం కొనసాగింపునకు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం సమస్యలు, సవాళ్లు ఉన్నాయి.  

→ కీలక మూడవ అంశం.. రూపాయి విలువ. డాలరుతో రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్ట స్థాయి రికార్డులను కొనసాగిస్తోంది.  బుధవారం  ఆల్‌టైమ్‌ కనిష్టం 83.71 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 83.72 కనిష్టాన్ని తాకింది. 

→ భౌగోళిక ఆర్థిక అనిశ్చితి అంశాల నేపథ్యంలో... అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ న్యూయార్క్‌ కమోడిటీ ఎక్సే్చ ంజ్‌లో ఈ నెల 16వ తేదీన   ఔన్స్‌ కు (31.1గ్రా) ఆల్‌టైమ్‌ హై 2,489 డాలర్లను తాకిన  పసిడి ఆగస్టు కాంట్రాక్ట్‌ ధర అటు పై కొంత తగ్గినప్పటికీ... పటిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. అంతర్జాతీయ ఫ్యూ చర్స్‌లో 18 డాలర్లు అధికంగా 2,425 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో రూపాయి క్షీణిస్తూ... అంతర్జాతీయంగా ధర పెరుగుదల ధోరణే కొనసాగిస్తే దేశీయంగా సైతం బంగారం మున్ముందుకే సాగుతుందనడంలో సందేహం లేదు.  

పెట్టుబడులకు ప్లస్సే... 
దేశీయంగా శుభకార్యాల్లో భారతీయులు పసిడి కొనుగోళ్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిన అంశమే. ఇది ఎలాగూ తప్పని అంశం. ఇక పసిడి పెట్టుబడులకు ఇది తగిన అవకాశమనడంలో సందేహం లేదు.  వినియోగదారులకు ధరల తగ్గుదల ఇప్పుడు ప్రయోజనకరంగా ఎలానూ ఉంటుంది. తక్కువ ఖర్చులు అలాగే 2.5% వార్షిక వడ్డీని అందించే సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ వంటి డిజిటల్‌ ఆప్షన్‌లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమ యం అనడంలో సందేహం లేదు.

దేశీయంగా రెండోరోజూ భారీ తగ్గుదల 
బడ్జెట్‌లో నిర్ణయంతో దేశీయంగా రెండవరోజూ బుధవారమూ దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధానిలో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు రూ.650 తగ్గి, రూ. 71,650కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇంతే స్థాయిలో దిగివచ్చి రూ. 71,300కు దిగివచి్చంది. ఇక మంగళవారం రూ.4 వేల వరకూ తగ్గిన వెండి ధర బుధవారం అక్కడక్కడే 87,500 వద్ద ముగిసింది. దేశ రాజధాని ముంబైలో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు వరుసగా రూ. 451, రూ.449 తగ్గి రూ.69,151, రూ.68,874కు దిగివచ్చాయి. వెండి ధర రూ.57 తగ్గి రూ.84,862 వద్ద ముగిసింది.  
 

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)