క్రూర మృగాల్లా వెంట పడుతున్న వీధి కుక్కలు
Breaking News
గంటల వ్యవధిలో.. ఊహకందని గోల్డ్ రేటు!
Published on Mon, 03/30/2026 - 18:40
సోమవారం ఉదయం తగ్గిన బంగారం ధరలు.. సాయంత్రానికి పెరుగుదల దిశగా అడుగులు వేసింది. వెండి రేటు కూడా గరిష్టంగా రూ.5000 పెరిగింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో కొత్త ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
హైదరాబాద్, విజయవాడ నగరాలలో ఉదయం రూ.1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు సాయంత్రానికి రూ.1,35,900 వద్దకు చేరింది. దీన్ని బట్టి చూస్తే గంటల వ్యవధిలో రూ.900 పెరిగినట్లు స్పష్టమవుతోంది. 24 క్యారెట్ల తులం రేటు 1,47,280 రూపాయల దగ్గర నుంచి 1,48,260 రూపాయల (రూ.980 పెరిగింది) వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.
చెన్నైలో కూడా గోల్డ్ రేట్లలో మార్పులు జరిగాయి. దీంతో 24 క్యారెట్ల తులం బంగారం ధర 1,48,370 రూపాయల నుంచి 1,50,220 రూపాయల వద్దకు చేరింది. 22 క్యారెట్ల తులం పసిడి రేటు 1,36,050 రూపాయల వద్ద ఉంది.
ఢిల్లీలో ఉదయం 1,35,150 రూపాయల వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర.. సాయంత్రానికి 1,36,050 రూపాయల వద్దకు చేరింది. 24 క్యారెట్ల తులం గోల్డ్ రేటు 147430 రూపాయల దగ్గర నుంచి రూ.148410 వద్దకు చేరింది. ఇదంతా కేవలం గంటల వ్యవధిలో జరిగిన మార్పు.
వెండి ధర
ఈ రోజు (సోమవారం) ఉదయం రూ.2.50 లక్షల వద్ద స్థిరంగా ఉన్న వెండి రేటు.. సాయంత్రానికి రూ.5000 పెరిగింది. దీంతో కేజీ రేటు రూ.2.55 లక్షల వద్దకు చేరింది. అయితే ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ.2.45 లక్షల వద్ద ఉంది.
Tags : 1