పసిడి రూ. 3,900 డౌన్‌

Published on Wed, 11/19/2025 - 03:51

న్యూఢిల్లీ: వచ్చే నెలలో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ కీలక వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు సన్నగిల్లిన నేపథ్యంలో పసిడి ధరలు మంగళవారం గణనీయంగా తగ్గాయి. దేశీయంగా ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల 10 గ్రాముల పసిడి రేటు రూ. 3,900 క్షీణించింది. రూ. 1,25,800కి తగ్గింది. వెండి రేటు కూడా కేజీకి రూ. 7,800 తగ్గి రూ. 1,56,000కు దిగి వచ్చింది.

అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు సన్నగిల్లడం, ఈ వారం కీలక డేటా విడుదల అనంతరం ఫెడ్‌ రిజర్వ్‌ తీసుకోబోయే చర్యల గురించి ఇన్వెస్టర్లు నిరీక్షిస్తుండటంతో పసిడి, వెండి అమ్మకాల ఒత్తిడికి లోనైనట్లు ఆగ్మంట్‌ హెడ్‌ (రీసెర్చ్‌) రెనిషా చైనాని తెలిపారు. దేశీయంగా మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌లో) డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుకు సంబంధించి పసిడి రేటు క్రితం ముగింపు రూ. 1,22,927తో పోలిస్తే ఒక దశలో సుమారు రూ. 2,165 క్షీణించి రూ. 1,20,762కి తగ్గింది. 

వెండి ఫ్యూచర్స్‌ కూడా డిసెంబర్‌ కాంట్రాక్టు రూ. 3,660 మేర (సుమారు 2.36 శాతం) పతనమై రూ. 1,51,652 వద్ద ట్రేడయ్యింది. అంతర్జాతీయ మార్కెట్లు చూస్తే కామెక్స్‌ గోల్డ్‌ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌ ఔన్సుకి సుమారు 65 డాలర్లు (1.60 శాతం) క్షీణించి 4,009.5 డాలర్లకు తగ్గింది. 

గత నాలుగు సెషన్లలో పుత్తడి ధర ఏకంగా 204.1 డాలర్లు (సుమారు 4.84 శాతం) క్షీణించింది. అలాగే డిసెంబర్‌ కాంట్రాక్టు వెండి రేటు 2.38 శాతం క్షీణించి 49.50 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.   

#

Tags : 1

Videos

ఆగకుండా 5000 KMs.. ఐదు రోజుల్లో పరిగెత్తిన గద్దలు

నేడు CBI కోర్టుకు YS జగన్.. కేసుల నుంచి తప్పించుకునేందుకు బాబు తప్పుడు ప్రచారం

ఒకటి పోతే మరొకటి.. ఆన్ లైన్ లో మరో ఐబొమ్మ

తప్పుడు వార్తలకు చెంపదెబ్బ.. ఎల్లో ఉగ్రవాదుల తాట తీసిన ఈశ్వర్

50 సీట్లు చాలు.. అంతకు మించి వద్దు

కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకోనున్న YSRCP అధినేత YS జగన్ మోహన్ రెడ్డి

గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే

ఇవ్వాల్సింది 40K.. ఇచ్చింది 10K.. రైతును ముంచేసిన చంద్రబాబు

నిద్రలేచిన అగ్నిపర్వతం.. ఆ దేశం తగలపడుతుందా?

అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)

+5

తెలుసు కదా మూవీ సెట్‌లో సరదా సరదాగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

శ్రీశైలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫోటోలు)

+5

సినిమా పైరసీపై ఫిల్మ్‌ ఛాంబర్‌ మహా ధర్నా (ఫోటోలు)

+5

జీన్స్ డ్రెస్సులో మెరుస్తున్న అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో బిగ్‌బాస్ సోనియా.. లేటేస్ట్‌ బేబీ బంప్‌ ఫోటోలు చూశారా?

+5

ముత్యపు పందిరి వాహ‌నంపై అమ్మవారు

+5

“సంతాన ప్రాప్తిరస్తు” మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)