Breaking News

మెటల్స్‌ క్రాష్‌

Published on Sat, 01/31/2026 - 04:09

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా బలహీన ట్రెండ్స్‌ మధ్య ఇన్వెస్టర్లు భారీగా లాభాల స్వీకరణకు దిగడం, అమెరికా డాలరు పుంజుకోవడం తదితర అంశాల నేపథ్యంలో శుక్రవారం బంగారం, వెండి ధరలు గణనీయంగా పతనమయ్యాయి. న్యూఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి 10 గ్రాముల రేటు ఏకంగా రూ. 14,000 క్షీణించి రూ. 1,69,000కు తగ్గింది. అటు వెండి సైతం కేజీకి రూ. 20,000 తగ్గి రూ. 3,84,500కి క్షీణించింది.  దేశీయంగా ఫ్యూచర్స్‌ మార్కెట్‌ ఎంసీఎక్స్‌లో బంగారం ఏప్రిల్‌ కాంట్రాక్టు 8% క్షీణించి రూ. 1,68,750 వద్ద ట్రేడయ్యింది.

సిల్వర్‌ మార్చ్‌ కాంట్రాక్టు ఒక దశలో క్రితం ముగింపు రూ. 4,20,048తో పోలిస్తే ఏకంగా రూ. 1,07,971 మేర పతనమైంది. దాదాపు 27% పడిపోయి రూ. 2,91,922 వద్ద ట్రేడయ్యింది. రికార్డు బ్రేకింగ్‌ ర్యాలీ అనంతరం  లాభాల స్వీకరణ జరగడంతో పసిడి, వెండి ధరలు కరెక్షన్‌కి లోనైనట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ అనలిస్ట్‌ సౌమిల్‌ గాంధీ తెలిపారు. 

అంతర్జాతీయంగా స్పాట్‌ మార్కె ట్లో బంగారం ధర ఔన్సుకి (31.1 గ్రాములు) 285.30 డాలర్లు తగ్గి 5,087.73 డాలర్లకు క్షీణించింది. ఒక దశలో 425.86 డాలర్లు క్షీణించి 4,945.26 డాలర్లకు పతనమైంది. ఇక వెండి కూడా ఇంట్రాడేలో 17.5 శాతం పడి 95.26 డాలర్లను కూడా తాకింది. చివరికి 12% (14 డాలర్లు) తగ్గి 101.47 డాలర్ల వద్ద ముగిసింది. ఫ్యూచర్స్‌ మార్కెట్‌ కామెక్స్‌లో పుత్తడి ఏప్రిల్‌ కాంట్రాక్టు 273 డాలర్లు తగ్గి 5,085 డాలర్ల దగ్గర ట్రేడయ్యింది. వెండి దాదాపు 16 డాలర్లు క్షీణించి 98.70 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయింది.

 

Videos

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)