Breaking News

ఒకే రోజు రెండుసార్లు తగ్గిన గోల్డ్ రేటు: కారణాలివే!

Published on Mon, 10/27/2025 - 18:52

భారీగా పెరిగిన బంగారం ధరలు.. క్రమంగా తగ్గుతూనే ఉన్నాయి. ఈ రోజే (అక్టోబర్ 27) గోల్డ్ రేటు రెండోసారి తగ్గింది. ఉదయం గరిష్టంగా రూ. 1050 తగ్గిన రేటు.. సాయంత్రానికి మరో రూ. 1290 తగ్గింది (మొత్తం రూ. 2340 తగ్గింది). దీంతో మరోమారు పసిడి ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ప్రస్తుత ధరలకు సంబంధించిన వివరాల విషయానికి వస్తే..

హైదరాబాద్, విజయవాడ మొదలైన ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 2340 తగ్గి.. రూ. 1,23,280 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ. 2150 రూపాయలు తగ్గి రూ. 1,13,000 వద్దకు చేరింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై నగరాల్లో కూడా కొనసాగుతాయి.

ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు గణనీయంగా తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 2340 తగ్గి రూ. 1,23,430 వద్ద ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల రేటు రూ. 2150 తగ్గి రూ. 1,13,150 వద్దకు చేరింది.

చెన్నైలో బంగారం ధరలలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి ఇక్కడ గోల్డ్ రేటు ఉదయం ఎలా ఉందో.. సాయంత్రానికి కూడా అలాగే ఉంది. (24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 540 తగ్గి.. రూ. 1,24,910 వద్ద.. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ గోల్డ్ రేటు 500 తగ్గి.. రూ. 1,14,500 వద్ద నిలిచింది).

గోల్డ్ రేటు తగ్గడానికి ప్రధాన కారణాలు
అమెరికా డాలర్ బలపడం: డాలర్ విలువ పెరిగితే.. బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి. ఎందుకంటే బంగారం డాలర్‌లోనే ట్రేడ్ అవుతుంది.
వడ్డీ రేట్లు పెరగడం: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచితే, ఇన్వెస్టర్లు బంగారం కంటే బాండ్లు లేదా ఇతర వడ్డీ ఇచ్చే ఆస్తుల్లో పెట్టుబడి పెడతారు.
ద్రవ్యోల్బణం తగ్గడం: ద్రవ్యోల్బణం తగ్గితే, బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావించేవారు సంఖ్య తగ్గుతుంది.
రాజకీయ పరిస్థితులు: ప్రపంచ రాజకీయ పరిస్థితులు కొంత స్థిరంగా ఉండడం వల్ల, బంగారం ధరలపై ఒత్తిడి తగ్గుతుంది.
చైనాలో డిమాండ్ తగ్గడం: బంగారాన్ని అధికంగా కొనుగోలు చేసే దేశాల జాబితాలో చైనా, భారత్ ముందు వరుసలో ఉంటాయి. అయితే చైనాలో ఆర్థిక మందగమనం వల్ల డిమాండ్ కొంత తగ్గింది.

ఇదీ చదవండి: 'ఆలస్యం చేయొద్దు.. వేగంగా కొనండి': రాబర్ట్ కియోసాకి

#

Tags : 1

Videos

అంబాలా ఎయిర్ బేస్ లో రాష్ట్రపతి ముర్ము సాహసం!

భారీ గాలులతో వర్షాలు.. హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక

Montha Cyclone : వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించిన గంగుల బ్రిజేంద్ర రెడ్డి

APSRTCపై మోంథా పంజా.. ప్రయాణికుల కష్టాలు

డ్రగ్స్ మాఫియాపై ఎటాక్.. 64 మంది మృతి..

Montha Cyclone: 60 ఏళ్ల వయసులో ఇలాంటి ఉప్పెన చూడలేదు

బాబు వద్దనుకున్న గ్రామ సచివాలయ సిబ్బందే కీలక పాత్ర పోషించారు..

Jains Nani: ప్రొడ్యూసర్ వాళ్ళని తిట్టడంలో తప్పు లేదు

టీడీపీ నేతల అక్రమ మైనింగ్ ని బయటపెట్టిన శైలజానాథ్

ఆసీస్ తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పు

Photos

+5

తెలంగాణపై మోంథా పంజా.. కుండపోత వర్షాలు (ఫొటోలు)

+5

హీరోయిన్ ప్రియా వారియర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

వణికించిన మోంథా.. స్తంభించిన జనజీవనం (ఫొటోలు)

+5

నిర్మాత దిల్‌రాజు ఇంట్లో పెళ్లి సందడి (ఫొటోలు)

+5

క్యూట్‌గా కవ్విస్తోన్న జెర్సీ బ్యూటీ (ఫోటోలు)

+5

ఒంటరిగా మాల్దీవులు టూర్‌లో నమ్రత (ఫొటోలు)

+5

నా ప్రేమ ఈ రోజే పుట్టింది! లవ్‌ లేడీకి లవ్లీ గ్రీటింగ్స్‌ (ఫొటోలు)

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)