Breaking News

వారం రోజులు.. మారిన బంగారం ధరలు

Published on Sun, 12/21/2025 - 12:09

దేశంలో బంగారం ధరలు రోజురోజుకీ మారిపోతున్నాయి. తీవ్రమైన హెచ్చుతగ్గులు, బలమైన రికవరీతో గత వారం రోజుల్లో (డిసెంబర్ 14 – డిసెంబర్ 21) హైదరాబాద్‌ సహా తెలుగురాష్ట్రాల్లో బంగారం ధరలు గణనీయ మార్పులు నమోదు చేశాయి. 24 క్యారెట్ల మేలిమి బంగారంతోపాటు ఆభరణాలకు వినియోగించే 22 క్యారెట్ల పసిడి లోహం ధరలు మొత్తంగా చూస్తే స్వల్పంగా పెరిగాయి.

ధరల మార్పు ఇలా..
డిసెంబర్ 14న రూ.1,33,910గా ఉన్న 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర..  పెరుగుతూ.. తగ్గుతూ డిసెంబర్ 21 నాటికి రూ.1,34,180 వద్దకు చేరింది. అంటే ఏడు రోజుల అనంతరం నికరంగా రూ.270 పెరిగింది.

ఇక 22 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే డిసెంబర్ 14న రూ.1,22,750తో ప్రారంభమై, డిసెంబర్ 21న రూ.1,23,000 వద్ద కొనసాగుతోంది. నిరకంగా చూస్తే వారం రోజుల్లో రూ.250 ఎగిసింది.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు

  • బంగారాన్ని ప్రస్తుతం గ్లోబల్ ఇన్వెస్టర్లు ‘సేఫ్-హేవెన్’గా కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక అనిశ్చితుల సమయంలో బంగారం డిమాండ్.. ధరలు పెరుగుతున్నాయి.

  • అంతర్జాతీయ బంగారం ధరలు యూఎస్ డాలర్ బలం, అంతర్జాతీయ వడ్డీ రేట్ల నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. డాలర్ బలంగా మారితే బంగారం ఫ్యూచర్స్‌పై ప్రభావం పడుతుంది. ఇది స్థానిక ధరలను ప్రభావితం చేస్తుంది.

  • డిసెంబర్‌లో పండుగలు, శుభదినాలు, పెళ్లి సీజన్ మొదలైన సందర్భాల నేపథ్యంలో బంగారం కొనుగోలు ఎక్కువగా ఉంటుంది. ఈ డిమాండ్ కూడా ధరల పెరుగుదలకు దోహదం చేస్తోంది.

  • ఇక స్థానికంగా ఉన్న పన్నులు, సరఫరా, డిమాండ్ కూడా రోజువారీ పసిడి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. సీజనల్ డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు పెరిగే అవకాశం ఉంది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)