TDP MLA చేసిన అవమానం.. షరీఫ్ కు ముస్లిం నేతల పరామర్శ
Breaking News
స్టాక్ మార్కెట్ ఎఫెక్ట్.. ఒక్కసారిగా పెరిగిన గోల్డ్ రేటు!
Published on Tue, 01/20/2026 - 19:50
స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగిసిన తరువాత.. బంగారం, వెండి ధరలు అమాంతం పెరిగిపోయాయి. మంగళవారం ఉదయం ఉన్న ధరలకు, సాయంత్రం ధరలకు పొంతన లేకుండా.. ఊహించని స్థాయికి చేరిపోయాయి. దీంతో గోల్డ్ రేటు రూ.1.50 లక్షలు క్రాస్ చేయగా.. సిల్వర్ 3.4 లక్షల వద్దకు చేరింది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం.
విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, ప్రొద్దుటూరు మొదలైన ప్రాంతాల్లో ఉదయం రూ. 1,35,000 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు.. సాయంత్రానికి రూ. 1,37,300 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల రేటు 147280 రూపాయల దగ్గర నుంచి రూ. 1,49,780 వద్దకు చేరింది.
చెన్నైలో మాత్రం 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,39,000 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 1,51,640 వద్ద నిలిచాయి.
ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు భారీగా పెరిగింది. ఇక్కడ 22 క్యారెట్ల 10 గ్రామ్స్ రేటు రూ. 1,37,450 వద్ద, 24 క్యారెట్స్ 10 గ్రాముల ధర రూ. 1,49,910 వద్ద నిలిచాయి.
వెండి ధరలు
బంగారం ధరలు మాత్రమే కాకుండా.. వెండి రేటు కూడా భారీగా పెరిగింది. కేజీ సిల్వర్ రేటు రూ. 22000 పెరిగింది. దీంతో 1000 గ్రాముల ధర 3.40 లక్షలకు చేరింది. ఈ ధరలు ఇప్పటివరకు ఆల్ టైమ్ రికార్డ్ అనే చెప్పాలి.
Tags : 1