Breaking News

అయ్య బాబోయ్.. ఇక బంగారం కొనలేం!

Published on Fri, 01/31/2025 - 11:00

కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' ప్రవేశపెట్టనున్న బడ్జెట్ 2025లో బంగారం దిగుమతికి సంబందించిన సుంకాలను తగ్గించాలని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో నేడు (జనవరి 31) బంగారం ధరలు (Gold Price) తారాజువ్వలాగా పైకి లేచాయి. తులం పసిడి రేటు గరిష్టంగా రూ. 1310 పెరిగింది. దీంతో బంగారం ధరల్లో భారీ మార్పులు ఏర్పడ్డాయి.

హైదరాబాద్, విజయవాడలలో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 77,300 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 84,330 వద్ద నిలిచాయి. నిన్న రూ. 150, రూ. 170 పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు ఒక్కసారిగా రూ. 1200 (22 క్యారెట్స్ 10గ్రా), రూ. 1310 (24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది.

చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 1200, రూ. 1310 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 77,300 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 84,330 వద్ద ఉంది. చెన్నైలో కూడా నిన్న పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి.

ఇదీ చదవండి: బంగారం.. మరింత పెరిగే అవకాశం!

దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు రూ. 77450 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 84,480 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1200, రూ. 1310 ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు కొంత ఎక్కువగానే ఉంది.

వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి రేటు కూడా పెరిగింది. దీంతో ఈ రోజు (31 జనవరి) కేజీ సిల్వర్ రేటు రూ. 1,07,000లకు చేరుకుంది. నిన్నటి కంటే ఈ రోజు ధర రూ. 1000 పెరిగింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 99,500 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)