Breaking News

వారం రోజుల్లో ఇంత పెరిగిందా.. బంగారం ధరల్లో భారీ మార్పు!

Published on Sat, 01/17/2026 - 20:14

బంగారం ధరలు వారం రోజులుగా తగ్గుతూ.. పెరుగుతూ దాదాపు రూ. 1,50,000 మార్క్ చేరుకోవడానికే అన్నట్లు దూసుకెళ్తున్నాయి. జనవరి 11వ తేదీ 1,40,460 రూపాయల వద్ద ఉన్న గోల్డ్ రేటు.. నేటికి 1,43,780 రూపాయల వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే పసిడి ధరల్లో ఎంత మార్పు వచ్చిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,40,460 నుంచి రూ. 1,43,780లకు చేరుకుంది. వారం రోజుల్లో పసిడి ధరలు 3320 రూపాయలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం విషయానికి వస్తే.. వారం రోజుల్లో 1,28,750 రూపాయల నుంచి 1,31,800 రూపాయల వద్దకు చేరింది.  అంటే 3050 రూపాయలు పెరిగిందన్నమాట.

చెన్నైలో జనవరి 11న 1,39,650 రూపాయల వద్ద ఉన్న 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం ధర 17వ తేదీ నాటికి 1,44,870 రూపాయల (రూ.5220 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రామ్స్ బంగారం రేటు రూ. 1,29,000 నుంచి రూ. 1,32,800 (రూ. 3800 పెరిగింది) వద్దకు చేరింది.

ఇదీ చదవండి: 'వెండి దొరకడం కష్టం': కియోసాకి

ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. 1,40,610 రూపాయల నుంచి వారం రోజుల్లో 1,43,930 రూపాయల (రూ. 3320 పెరిగింది) మార్క్ చేరుకుంది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,28,900 వద్ద నుంచి రూ. 1,31,950 వద్దకు (3050 రూపాయలు పెరిగింది) చేరింది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)