Breaking News

బంగారం భారీగా పడిపోతుంది!

Published on Sun, 04/27/2025 - 13:31

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు అంతకంతకూ పెరుగుతూ తారాస్థాయికి చేరాయి. భారత్‌లో అయితే 10 గ్రాముల పసిడి ధర ఏకంగా రూ.లక్ష దాటి తర్వాత కాస్త తగ్గింది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న బంగారం ధరలతో ఆందోళన చెందుతున్న వారికి ఉపశమనం కలిగించే వార్తొకటి వచ్చింది. వచ్చే 12 నెలల్లో బంగారం ధర భారీగా పడిపోయే అవకాశం ఉందని కజకిస్థాన్ గోల్డ్ మైనింగ్‌ సంస్థ సాలిడ్ కోర్ రిసోర్సెస్ పీఎల్‌సీ సీఈఓ చెబుతున్నారు.

12 నెలల్లో బంగారం ధరలు (ఒక ఔన్స్‌) 2,500 డాలర్లకు చేరుకుంటుందని సాలిడ్ కోర్ రిసోర్సెస్ సీఈఓ 'విటాలీ నేసిస్' రాయిటర్స్‌తో  చెప్పారు. అయితే 1,800 - 1,900 డాలర్ల స్థాయికి చేసే అవకాశం లేదు. సాధారణంగా బంగారంపై ఓ స్థాయి వరకు ప్రతిస్పందన ఉంటుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్నది (ధరలు పెరగడం) ఓవర్ రియాక్షన్' అని కజకిస్థాన్ రెండో అతిపెద్ద గోల్డ్ మైనర్ సాలిడ్‌కోర్‌ నేసిస్ అంటున్నారు.

ఎంతకు తగ్గొచ్చు? 
నేసిస్ చెబుతున్నదాని ప్రకారం.. ఒక ఔన్స్‌ అంటే 28.3495 గ్రాముల బంగారం ధర 2,500 డాలర్లకు తగ్గుతుంది. అంటే 10 గ్రాముల ధర దాదాపు రూ. 75,000 లకు దిగొస్తుంది.  సాంప్రదాయకంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చిత పరిస్థితులకు వ్యతిరేకంగా రక్షణ కవచంగా భావించే బంగారం ధర ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు 26 శాతం పెరిగింది. ఎందుకంటే యూఎస్ సుంకాలు మాంద్యం భయాలను రేకెత్తించాయి. ఈ క్రమంలో గత మంగళవారం అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్‌ బంగారం రికార్డు స్థాయిలో 3,500.05 డాలర్లను తాకింది.

👉ఇదీ చదవండి: చూశారా.. ‘బంగారమే డబ్బు’!

ప్రస్తుతం ధరలు ఇలా..
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు, డాలర్‌తో రూపాయి మారకం రేటు, స్థానిక డిమాండ్ వంటి అంశాలు ఈ ధరలపై ప్రభావం చూపుతున్నాయి.  ఏప్రిల్ 26 నాటికి దేశంలోని ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి..

తెలుగు రాష్ట్రాల్లో..
- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210
- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020

చెన్నైలో..
- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210
- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020

👉ఇది చదివారా? బంగారం.. ఈ దేశాల్లో చవకే..!!

ఢిల్లీలో.. 
- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,310
- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,170

ముంబైలో..
- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210
- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020

బెంగళూరులో..
- 24 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.98,210
- 22 క్యారెట్ బంగారం (10 గ్రాములు): రూ.90,020

(గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)