కంగారు పెడుతున్న బంగారం.. త్రీ-డైమెన్షన్‌ స్టోరీ!

Published on Mon, 11/23/2026 - 07:09

నిజమే బంగారం అందరినీ కంగారు పెడుతోంది. ఒకప్పుడు ‘కంగారూ’లాగా ధర పెరుగుతూ పోయిన బంగారం.. ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. ‘రంకెలు’ వేసుకుంటూ పరుగెత్తిన బంగారం.. దిగి వస్తోంది. ఇప్పుడు బంగారానికి సంబంధించి త్రీ–డైమెన్షన్‌ స్టోరీ, ఎవరి పరిస్థితి ఏమిటో తెలుసుకుందాం.

ఎ) వినియోగదారుడి తరఫున..
ఇప్పుడు కొనాలా.. అమ్మాలా
ఎటువంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మకండి. ప్రత్యక్షంగా ధర తగ్గుదల మీకు నష్టదాయకం. మీరు గతంలో చెల్లించిన జీఎస్‌టీ, తరుగు మజూరీ వెనక్కి రావు. వచ్చిన నష్టాన్ని ఇన్‌కంట్యాక్స్‌ లెక్కల్లో చూపించడానికి వ్యక్తులకు వీలు కాదు. వీలయితే, కొనండి. అయితే, బంగారం కొనడానికి ఎప్పుడు ఫాలో అవ్వాల్సిన ‘బంగారం’లాంటి రూలు. మీ కెపాసిటీ. వైట్‌ సోర్సు. మీరు ట్యాక్స్‌ చెల్లించగా మిగిలిన సేవింగ్స్, పీఎఫ్‌ విత్‌డ్రాయల్స్‌. జీవిత బీమా మెచ్యూరిటీలు, వేసిన ఎఫ్‌డీలను వెనక్కి తీసుకోగా వచి్చన మొత్తాలు.. లెక్కల్లో చూపించిన వ్యవసాయ ఆదాయం .. ఇదంతా ఒక్క మాటలో చెప్పాలంటే వైట్‌ సోర్స్‌. విదేశాల నుంచి మీ కుటుంబ సభ్యులు పంపిన మొత్తం .. మీకు ‘వైట్‌’ రూపంలో వచ్చిన అప్పు. ఇలాంటి పరిస్థితుల్లో లెక్కలు పక్కాగా ఉంటే గబుక్కుని వెళ్లి కొనండి.

‘పాత బంగారం’ ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌
పాత బంగారం అమ్మకండి. అంతే కాకుండా పాత బంగారం కుదువ పెట్టి రుణాలు తీసుకోకండి. విలువ తక్కువగా ‘పలికి’ రుణం తక్కువ వస్తుంది. అప్పు నిప్పులాంటిది అనుకోండి. బంగారం అమ్మకపోతే, మార్కెట్లో హెచ్చుతగ్గులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. అవన్నీ ఊహాజనితం.

ఎక్స్చేంజ్ కొంత మెరుగు 
పాత బంగారాన్ని ఇచ్చి, కొత్తగా కొనుక్కోవడం .. ఉన్న బంగారం/ఆభరణాలను ఎక్స్చేంజ్ చేసి కొత్త ఆభరణాలు చేయించుకోవడం.. ఇది కొంత మెరుగు. ఎందుకంటే, కొత్త బంగారం ధర తగ్గింది. తరుగు, మజూరీలు అంత ప్రభావం చూపవు. లెక్కల కన్నా మీ కుటుంబ అవసరాలు, ఇష్టాలు, ఇంట్లో పెళ్లిళ్లు, కార్యాలను బట్టి అడుగేయండి. పాతదాన్ని అమ్మేసి, కొత్త బంగారం కొనుక్కోవడం కంటే ఎక్సే్చంజ్‌ బెటర్‌.

బి)  నగల వ్యాపారుల కష్టనష్టాలు
ధరలు ఆకాశాన్ని అంటినప్పుడు ఏ వ్యాపారైనా మీ మీద జాలి పడ్డాడా? ఒక్క రూపాయి తగ్గించాడా? కరోనా సమయంలో బంగారం ధరలు పెరిగాయి. రికార్డు స్థాయికి ఎగిసింది. స్టాక్‌మార్కెట్‌ పడిపోవడం, ఆర్థిక అనిశ్చితి, పెట్టుబడిదారులు ఎగబడి కొన్నారు. వడ్డీలు తగ్గించడం వల్ల నిధులు మిగిలి, ఖర్చులన్నీ (చేయలేక) మిగుల్చుకుని, సేవ్‌ చేసి కొన్నారు. బంగారం సరఫరా తగ్గిపోతుందని ‘ఎక్కువ’ కొన్నారు. అప్పుడేం లేదు ‘కరుణ’ .. అంతా కరోనాయే! అయితే, ఎక్కువ ధర పెట్టి కొన్నది అమ్మితే నష్టం వాటిల్లవచ్చు. కానీ టర్నోవరు పెరుగుతోంది. జనాల తాకిడి పెరిగింది. షాపులు కిటకిటలాడుతున్నాయి. లాభాల మార్జిన్‌ శాతం తగ్గదు. కాబట్టి విక్రేతలు తెగ మెరుగుస్తున్నారు. లాంగ్‌ రేంజ్‌లో వాళ్లు సెటిల్‌ అయిపోతారు.

ఇదీ చదవండి: అందుకే బంగారం ధరలు భారీగా తగ్గాయ్: నరేంద్ర మోదీ

సి) రుణ సంస్థలు
బంగారం ధర పడిపోవడం వల్ల తీసుకున్న రుణం కంటే బంగారం విలువ తగ్గవచ్చు. అలా తగ్గినా అప్పు తీసుకున్న వ్యక్తి రుణం/వడ్డీ చెల్లిస్తే ఎటువంటి ప్రమాదం లేదు. లేకపోతే, ఆ ఖాతా నిరర్థకం అవుతుంది. మొండి బాకీ .. రాని బాకీ అవుతుంది. అందుకని సంస్థలు రికవరీ చర్యలు చేపట్టాయి. కఠినంగా వ్యవహరిస్తున్నారు. మార్జిన్‌ మెయింటెయిన్‌ చేయడానికి మరింత బంగారం ఇవ్వమంటున్నారు.  
చివరగా .. అవసరం ఉండి కొన్నా, అనవసరంగా కొన్నా, ముందుజాగ్రత్తగా కొన్నా, ఆడంబరానికి కొన్నా, పొదుపు కోసం కొన్నా, పెట్టుబడి కోసం కొన్నా, వ్యాపార నిమిత్తం కొన్నా ‘సోర్స్‌’ ఉండాల్సిందే.

ట్యాక్సేషన్‌ నిపుణులు: డా. కందాళ సత్యనారాయణ మూర్తి, కె.వి.ఎన్‌ లావణ్య

Videos

బిస్లరీ వాటర్ తాగుతున్నారా.. అయితే అంతే సంగతి.. FSSAI షాకింగ్ ప్రకటన..

షర్మిల గారు మిమ్మల్నే అడుగుతున్న.. వీటికి సమాధానం చెప్పండి చాలు..

పాక్ చేతిలో భారత్ కు ఘోర ఓటమి...

పెళ్ళికొడుకు తరుపు వాళ్ళు ఎంత బాధ పడుతున్నారంటే.. రాంనాథ్ షాకింగ్ నిజాలు

కేవలం 1 లక్షతో 10 లక్షలు సంపాదించే ప్లాన్.!

రణబీర్, యష్ కాదు..! పార్ట్ 2లో ఆయనే హైలెట్...

కండువా కప్పుకోలేదంతే..! బాబు చిటికెయ్యగానే.. పెళ్లి ఉన్నా సరే బెంగళూరు వెళ్లిపోయింది..

పేర్ని కిట్టు ఆధ్వర్యంలో YSRCP చేరిన TDP సీనియర్ నేత

చెల్లి అడిగిందని సొంత ఆస్తి ఇచ్చాడు.. తనది కాని ఆస్తి ఎలా ఇస్తాడు?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. లక్షకు దిగి రానున్న బంగారం..!

Photos

+5

‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్... రెడ్‌ శారీలో మెరిసిన హీరోయిన్‌ డింపుల్ హయాతి (ఫోటోలు)

+5

కార్తీక సోమవారం.. శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు (ఫోటోలు)

+5

విశాఖపట్నం : కార్తీక సండే.. సందడి (ఫోటోలు)

+5

అనిరుధ్- కావ్య రిసెప్షన్‌లో సినీ, క్రీడా ప్రముఖుల సందడి.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : కోటి దీపోత్సవంలో వైభవంగా మధుర మీనాక్షి కల్యాణం (ఫోటోలు)

+5

శర్వానంద్‌ ‘భోగి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)

+5

మిర్నా తాజా ఫొటోలు..

+5

ప్రభాస్‌ బ్యూటీ.. చీరలో మెరిసి (ఫోటోలు)

+5

డేంజర్ బాయ్స్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు)

+5

హై మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)