Breaking News

కొత్త ఏటీఎమ్‌.. ఇలా బంగారం వేస్తే అలా డబ్బులొస్తాయ్‌..

Published on Mon, 04/21/2025 - 11:11

ఏటీఎం గురించి తెలుసా? అని ఎవరినైనా అడిగితే.. అదెందుకు తెలియదు మాకు తెలుసు అనే చాలామంది చెబుతారు. అయితే గోల్డ్ ఏటీఎం గురించి తెలుసా? అని అడిగితే.. అడిగిన వాళ్లనే అనుమానంగా చూస్తారు. బహుశా మీ అనుమానం కరెక్టే కావచ్చు, కానీ అలాంటి ఏటీఎం కూడా ఒకటి వచ్చేసింది. దాని గురించి తెలుసుకోవాలంటే, ఈ కథనం చదివేయాల్సిందే..

చైనాలోని షాంఘైలో బంగారాన్ని కరిగించి, దానికి తగిన డబ్బును అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌ చేసే ఏటీఎం మెషిన్ అందుబాటులోకి వచ్చింది. ఇందులో గోల్డ్ వేస్తే.. దాని బరువును, నాణ్యతను బట్టి.. ఆ రోజు మార్కెట్ విలువను బట్టి వినియోగదారుడి బ్యాంక్ ఖాతాకు డబ్బును జమ చేస్తుంది. ఇదంతా కొన్ని నిమిషాల వ్యవధిలోనే జరిగిపోతుంది. ఈ మెషిన్ బంగారాన్ని 1,200 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగిస్తుంది తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది.

ఇదీ చదవండి: దిగ్గజ బ్యాంక్ కీలక నిర్ణయం.. మారిన ఏటీఎం ఛార్జీలు

వీడియోలో గమనించినట్లయితే.. ఒక మహిళ బంగారాన్ని ఏటీఎం మెషిన్‌లో వేసిన తరువాత, ఆ రోజు ధరలను లెక్కగట్టి, బంగారంకు విలువకు తగిన డబ్బును ట్రాన్స్‌ఫర్‌ చేస్తుంది. ఇదే ప్రపంచంలోని మొట్ట మొదటి గోల్డ్ ఏటీఎం మెషిన్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. టెక్నాలజీకి ఫిదా అయిపోతున్నారు.

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)