Breaking News

బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కసారిగా ఎగిసిన పసిడి

Published on Thu, 09/19/2024 - 07:41

అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒక్కసారిగా ఎగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో బుధవారం బంగారం ధరలు ఆల్ టైమ్ గరష్టాలకు పెరిగాయి.

బుధవారం మధ్యాహ్నం 2:17 గంటల సమయానికి స్పాట్ బంగారం 0.9% పెరిగి ఔన్సుకు 2,592.39 డాలర్ల వద్ద ఉంది. యూఎస్‌  గోల్డ్ ఫ్యూచర్స్ 0.2% పెరిగి 2,598.60 డాలర్ల వద్ద స్థిరపడ్డాయి. యూఎస్‌ సెంట్రల్ బ్యాంక్ బుధవారం ప్రకటించిన అర శాతం రేట్ల కోతతో ద్రవ్య విధాన సడలింపు స్థిరంగా కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. ఫెడ్ బెంచ్‌మార్క్ రేటు ఈ సంవత్సరం చివరి నాటికి మరో అర శాతం, 2025లో పూర్తిగా ఒక శాతం తగ్గుతుందని భావిస్తున్నారు.

వడ్డీ రేట్ల తగ్గింపుతో అందరి దృష్టి బంగారంపై పడింది. పసిడిపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపే అవకాశం ఉండటంతో అంతర్జాతీయంగా బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. ఇదే సమయంలో డాలర్‌పై భారం పెరిగింది. డాలర్‌తో పోలిస్తే ఇతర కరెన్సీలను కలిగి ఉన్న ఇన్వెస్టర్లకు బంగారం చౌకగా ఉండనుంది.

ఫెడ్ రేట్‌ కట్ తరువాత డాలర్ 0.5% పతనమైంది. 2023 జూలై నుండి దాని కనిష్ట స్థాయికి పడిపోయింది.ఇన్వెస్టర్లు  ఇప్పుడు పాలసీ మార్గంపై ఫెడ్‌ చైర్ జెరోమ్ పావెల్ నుంచి మరిన్ని సూచనల కోసం ఎదురు చూస్తున్నారు. కాగా స్పాట్ వెండి సోమవారం రెండు నెలల గరిష్ట స్థాయికి చేరిన తర్వాత ఔన్స్‌కు 0.6% పెరిగి 30.93 డాలర్ల వద్దకు చేరింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)