Breaking News

గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు మళ్లీ ఆదరణ 

Published on Thu, 06/12/2025 - 06:25

న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు)కు మే నెలలో తిరిగి డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు రూ.292 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో ఈ ఫండ్స్‌ నుంచి ఇన్వెస్టర్లు రూ.6 కోట్లను వెనక్కి తీసుకోగా, మార్చిలోనూ రూ.77 కోట్ల పెట్టుబడులను ఇవి కోల్పోవడం గమనార్హం. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల పట్ల ఇన్వెస్టర్లలో తిరిగి ఆసక్తి పెరిగినట్టు తెలుస్తోంది. మే చివరికి గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.62,453 కోట్లకు పెరిగింది. 

ఏప్రిల్‌ చివరికి ఇది రూ.61,422 కోట్లుగా ఉంది. ‘‘మే నెలలో గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెరగడం ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతుండడాన్ని సూచిస్తోంది. బంగారం ధరలు గరిష్టాల్లో స్థిరంగా ఉండడం, అంతర్జాతీయంగా అనిశి్చతులు కొనసాగుతుండడంతో హెడ్జింగ్‌కు బంగారం మంచి సాధనంగా కనిపిస్తోంది’’అని మారి్నంగ్‌ స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ ఇండియా సీనియర్‌ అనలిస్ట్‌ నేహల్‌ మెష్రామ్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా మే నెలలో బంగారం ధరలు స్థిరంగా ఉండడంతో పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్‌కు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించి ఉంటారని అభిప్రాయపడ్డారు.  

పెరుగుతున్న అవగాహన 
తమ పెట్టుబడుల్లో బంగారాన్ని కూడా కలిగి ఉండాలని ఇన్వెస్టర్లు తెలుసుకుంటున్నాని, దీంతో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల కొనుగోళ్లు పెరిగినట్టు జెరి్మనేట్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ సీఈవో సంతోష్‌ జోసెఫ్‌ తెలిపారు. ‘‘బంగారం అన్నది వినూత్నమైన సాధనం. ఇది డాలర్‌ డినామినేషన్‌లో ఉంటుంది. ఈక్విటీలతో సంబంధం లేనిది. ఈక్విటీలకు ప్రతికూల సంబంధం కలిగి ఉంటుంది. కనుక పోర్ట్‌ఫోలియో హెడ్జింగ్‌కు ఇదొక చక్కని సాధనం’’అని జోసెఫ్‌ చెప్పారు. గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రూ.1,980 కోట్లుగా ఉండడం గమనార్హం.

అంటే మే నెలలో కాస్త మెరుగుపడినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోవాల్సి ఉందని తెలుస్తోంది. బంగారం ధరలు గత కొన్నేళ్లలో స్థిరమైన ర్యాలీ చేయడం గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులను గణనీయంగా వృద్ధి చేసిందని చెప్పుకోవాలి. ఇక మే నెలలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల పరిధిలో ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 2.24 లక్షలు పెరిగాయి. దీంతో మే చివరికి మొత్తం ఫోలియోలు 73.69 లక్షలకు చేరాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్‌ అయ్యే డిజిటల్‌ బంగారం సాధనం. భౌతిక బంగారం ధరలను ఇవి ప్రతిఫలిస్తుంటాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌ ఒక యూనిట్‌ ఒక గ్రాము బంగారానికి సమానంగా ఉంటుంది.   
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)