Breaking News

మదుపర్లను ఆకర్షించని గోల్డ్‌ ఈటీఎఫ్‌లు

Published on Sat, 10/21/2023 - 20:04

ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్న సమయంలో మదుపర్లు బంగారంపై మొగ్గుచూపుతుంటారు. దాంతో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో మదుపు చేస్తుంటారు. ఆగస్టు నెలలో ఈ ఈటీఎఫ్‌ల్లో గరిష్ఠంగా పెట్టుబడులు పెట్టారు. అయితే గత కొన్నిరోజులుగా బంగారం ధర పెరుగుతుంది. దాంతో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా గత నెలలో పసిడి ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లలోకి నికరంగా రూ.175 కోట్ల మేరకే  పెట్టుబడులు వచ్చాయని భారతీయ మ్యూచువల్‌ ఫండ్ల సంఘం (ఏంఎఆఫ్‌ఐ) వెల్లడించింది. ఆగస్టులో ఈ పెట్టుబడులు 17 నెలల గరిష్ఠమైన రూ.1028 కోట్లకు చేరాయి. జులైలో ఈ మొత్తం రూ.456 కోట్లుగా ఉంది.

అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగే వీలుండటం, ద్రవ్యోల్బణం అధికంగానే కొనసాగడం, వృద్ధి రేటు మందగించడంలాంటి కారణాల వల్ల ఇప్పటికీ బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగానే మదుపరులు భావిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ మధ్య సగటున నెలకు రూ.298 కోట్ల మేరకు పెట్టుబడులు పసిడి ఈటీఎఫ్‌లలోకి వచ్చాయి. గత ఏడాది ఆగస్టులోనూ వీటిల్లోకి రూ.1,100 కోట్ల మేరకు వచ్చాయి. ఈ ఏడాది సెప్టెంబరు నాటికి గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో మదుపు చేస్తున్న పోర్ట్‌ఫోలియోల సంఖ్య 48.06 లక్షలుగా ఉంది.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)