నేను ముందే ఊహించాను!.. బంగారం ధరలపై క్రిస్టోఫర్ వుడ్

Published on Tue, 09/16/2025 - 17:44

డాలర్ విలువ తగ్గినప్పుడు బంగారం, బిట్‌కాయిన్ రెండింటిపైన పెట్టుబడులు పెరుగుతాయని, మార్కెట్లో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని.. జెఫరీస్ గ్లోబల్ హెడ్ ఆఫ్ ఈక్విటీ స్ట్రాటజీ 'క్రిస్టోఫర్ వుడ్' పేర్కొన్నారు. గుర్గావ్‌లోని జెఫరీస్ ఇండియా ఫోరమ్‌లో మాట్లాడుతూ.. తన పోర్ట్‌ఫోలియో కేటాయింపులను కూడా వెల్లడించారు.

ప్రస్తుతం పసిడి ధరలు జీవితకాల గరిష్టాలను చేరుకున్నాయి. బంగారం ఔన్సుకు 3,698 డాలర్లకు పెరిగిన సమయంలో.. భారతదేశంలో కూడా 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1.11 లక్షలు దాటేసింది.

ఔన్స్ బంగారం 3600 డాలర్లకు చేరుతుందని.. నేను 2002లోనే అనుకున్నాను. ఊహించినట్లుగానే గోల్డ్ ఆ లక్ష్యాన్ని చేరుకుందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం గోల్డ్ కొత్త ట్రేడింగ్ శ్రేణిలోకి ప్రవేశించినట్లు కనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు. బంగారం (ఫిజికల్ గోల్డ్)పై ఆశ ఉన్నప్పటికీ.. నాకు గోల్డ్ మైనింగ్ స్టాక్‌లనే ఆసక్తి ఉందని అన్నారు. అయితే ఇది మొత్తం కంపెనీల లాభాల మీద ఆధారపడి ఉంటుంది.

ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక

బిట్‌కాయిన్‌ల విలువ కూడా భారీగా పెరుగుతోంది. నేను బంగారం & బిట్‌కాయిన్ రెండింటినీ సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కువ మంది ధనవంతులు బంగారాన్ని కొనుగోలు చేయకపోవచ్చు. వారంతా బిట్‌కాయిన్‌ను కొనుగోలు చేస్తారు. రాబోయే కాలం మొత్తం బిట్‌కాయిన్‌, బంగారంతోనే ముడిపడి ఉందని క్రిస్టోఫర్ వుడ్ పేర్కొన్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)