బంగారం ధరలు.. ఒక్క రోజూ తగ్గలేదు!

Published on Sun, 12/28/2025 - 10:18

దేశంలో బంగారం, వెండి ధరలు గత వారం చుక్కలు చూపించాయి. వారంలో ఒక్క రోజూ తగ్గకుండా వరుసగా భారీ పెరుగుదలను నమోదు చేస్తూ వచ్చాయి. హైదరాబాద్, విశాఖపట్నం సహా తెలుగు రాష్ట్రాల్లో గడిచిన ఏడు రోజుల్లో పసిడి, వెండి ధరలు పెరిగిన తీరు తెన్నుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

బంగారం ధరలు
24 క్యారెట్ బంగారం తులం (10గ్రాములు) ధర డిసెంబర్‌ 21న రూ.1,34,180 ఉండగా సరిగ్గా వారం తిరిగేసరికి డిసెంబర్‌ 28 నాటికి రూ.
1,41,220 లకు చేరింది. అంటే వారంలో ఏకంగా రూ.7,040 ఎగిసింది.

ఇక 22 క్యారెట్ బంగారం విషయానికి వస్తే.. డిసెంబర్‌ 21న రూ.1,23,000 ఉన్న తులం ధర డిసెంబర్‌ 28 నాటికి రూ.1,29,450 లకు చేరింది. అంటే వారంలో రూ.6,450 పెరిగింది.

వెండి ధరలు
గత వారం వెండి ధరల పెరుగుల వేగం బంగారాన్ని మించిపోయింది. డిసెంబర్‌ 21న రూ.2,26,000 ఉన్న కేజీ వెండి ధర డిసెంబర్‌ 28 నాటికి రూ.2,74,000లను తాకింది. మొత్తంగా ఏడు రోజుల్లో రూ.48,000 దూసుకెళ్లింది.

పెరుగుదలకు కారణాలివే..

  • అంతర్జాతీయ పరిస్థితులు: అమెరికా వడ్డీ రేట్ల తగ్గుదల, గ్లోబల్ ఆర్థిక అస్థిరతలు

  • సేఫ్‑హేవెన్ డిమాండ్: పెట్టుబడిదారులు బంగారం, వెండి వంటి సురక్షిత ఆస్తులలో పెట్టుబడి పెంచారు

  • ఎంసీఎక్స్‌/కామెక్స్‌ ధరల ప్రభావం: అంతర్జాతీయ మార్కెట్ రేట్లు దేశీయ ధరలను నేరుగా ప్రభావితం చేశాయి.

  • దేశీయ వినియోగం, కొనుగోలు:భవిష్యత్తు అవసరాల కోసం స్థానిక కొనుగోలు పెరగడం.

ఇది చదివారా? వెండి ఇంకా కొనచ్చా.. ఇప్పటికే లేటైందా?
 

Videos

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

Photos

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)