గోల్డ్‌ మరో హ్యాట్రిక్‌.. ఊహించని రేటుకు చేరిన బంగారం

Published on Fri, 01/17/2025 - 12:00

దేశంలో బంగారం ధరలు (Gold Price) మళ్లీ భగ్గుమన్నాయి. పండుగకు ముందు వరుసగా పెరిగిన పసిడి రేట్లు మరోసారి హ్యాట్రిక్‌ కొట్టాయి. నిన్నటితో పోల్చితే పసిడి ధరలు నేడు (January 17) భారీగా ఎగిశాయి. ఓ వైపు ధరలు పెరుగుతున్నా కొనుగోలుదారుల నుంచి డిమాండ్‌ మాత్రం తగ్గం లేదు.

పసిడి ధరలు ద్రవ్యోల్బణం, గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. నేటి బంగారం ధరలు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉన్నాయనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో ఈరోజు బంగారం 10 గ్రాముల ధరలు ఏకంగా రూ.600 (22 క్యారెట్స్), రూ.650 (24 క్యారెట్స్) చొప్పున పెరిగాయి. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 74,500కు, 24 క్యారెట్ల పసిడి రేటు రూ. 81,270 వద్దకు ఎగిశాయి.

ఇతర ప్రాంతాల్లో.. 
దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.81,420 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.74,650 వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే వీటి ధరలు వరుసగా రూ.600,  రూ.650 చొప్పున పెరుగుదలను నమోదు చేశాయి.

చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.600 పెరిగి రూ. 74,500 వద్దకు, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.650 ఎగిసి రూ. 81,270 వద్దకు చేరాయి. బెంగళూరు, ముంబై ప్రాంతాల్లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరలు కూడా నేడు హ్యాట్రిక్‌ పెరుగుదలను కనబర్చాయి. వెండి ధర కేజీకి రూ.1000 మేర పెరిగింది. దీంతో హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి కేజీ ధర రూ.1,04,000 వద్దకు, ఢిల్లీలో రూ. 96,500 వద్దకు చేరింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)