Breaking News

ఈ రోజు బంగారం ధర చూశారా?.. ఇక కొనడం కష్టమే!

Published on Thu, 02/20/2025 - 10:53

ఇంతింతై.. వటుడింతై అన్న చందాన, బంగారం ధరలు రోజురోజుకి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రోజు (ఫిబ్రవరి 20) కూడా పసిడి ధర గరిష్టంగా రూ. 390 పెరిగింది. దీంతో గోల్డ్ రేట్లలో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడలలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,700 వద్ద, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 88,040 వద్ద నిలిచాయి. నిన్న రూ. 650 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 700 (24 క్యారెట్స్ 10 గ్రా) పెరిగిన గోల్డ్ రేటు.. ఈ రోజు వరుసగా రూ. 350, రూ. 390 పెరిగింది. ఇదే ధరలు గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు వంటి ప్రాంతాల్లో కూడా కొనసాగుతాయి.

చైన్నైలో కూడా బంగారం ధరలు వరుసగా రూ. 350, రూ. 390 పెరిగింది. దీంతో ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 80,700 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 88,040 వద్ద ఉంది. చెన్నైలో నిన్న పసిడి ధర రూ. 650 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ. 700 (24 క్యారెట్స్ 10 గ్రా) పెరిగింది.

ఇదీ చదవండి: భారత్‌లో బంగారం ధరలు ఎవరు నిర్ధారిస్తారు: గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతోంది?

దేశ రాజధాని నగరంలో పసిడి ధరలు మరింత ఊపందుకున్నాయి. ఇక్కడ గోల్డ్ రేట్లు రూ. 80,850 (10గ్రా 22 క్యారెట్స్), రూ. 88,190 (10గ్రా 24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 390ఎక్కువ. అంతే కాకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. ఢిల్లీలో గోల్డ్ రేటు ఎక్కువగానే ఉంది.

వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి, కానీ వెండి ధర మాత్రం గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉంది. దీంతో ఈ రోజు (20 ఫిబ్రవరి) కేజీ సిల్వర్ రేటు రూ. 1,08,000 వద్దనే ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 1,00,500 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్‌టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)