పండగొచ్చింది.. బంగారం ధర పెరిగింది

Published on Mon, 01/13/2025 - 11:10

బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు గోల్డ్ రేటు (Gold Price) రూ.80 వేలు దాటేసింది. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు గరిష్టంగా రూ.430 పెరిగినట్లు స్పష్టమవుతోంది. ఈ నేటి (సోమవారం) బంగారం ధరలు ఏ ప్రాంతంలో ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.

హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు వంటి ప్రాంతాల్లో గోల్డ్ రేటు వరుసగా రూ.400 (22 క్యారెట్స్ 10గ్రా), రూ.430(24 క్యారెట్స్ 10గ్రా) పెరిగింది. దీంతో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 73,400లకు చేరుకోగా.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 80,070 వద్ద నిలిచింది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. నిన్న స్థిరంగా ఉన్న ధరలు ఈ రోజు పెరుగుదల దిశగా అడుగులు వేసాయి.

చైన్నైలో బంగారం ధరల విషయానికి వస్తే.. ఇక్కడ 10గ్రా 22 క్యారెట్ల పసిడి రేటు రూ. 73,400 వద్ద, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 80,070 వద్ద ఉంది. దీన్ని బట్టి చూస్తే నిన్నటి కంటే ఈ రోజు ధరలు వరుసగా రూ. 400, రూ. 430 పెరిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఇక దేశ రాజధాని నగరం ఢిల్లీ విషయానికి వస్తే.. ఇక్కడ కూడా గోల్డ్ రేటు పెరిగింది. ఈ రోజు 24 క్యారెట్ల 10గ్రా గోల్డ్ రేటు రూ.80,220 వద్ద.. 22 క్యారెట్ల పసిడి ధర రూ.73,550 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ.400,  రూ.420 పెరిగింది.

వెండి ధరలు (Silver Price)
బంగారం ధరలు మాదిరిగానే.. వెండి ధరలు కూడా పెరిగాయి. దీంతో కేజీ వెండి రేటు ఈ రోజు రూ. 10,2000 వద్ద ఉంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో వెండి ధరలు లక్ష వద్ద ఉన్నప్పటికీ.. ఢిల్లీలో మాత్రం కేజీ వెండి రేటు రూ. 94,500 వద్ద ఉంది.

2023లో రూ. 58వేలు వద్ద ఉన్న బంగారం ధర.. 2024 చివరి నాటికి రూ. 77,000 దాటేసింది. ఈ ధరలు 2025లో రూ. 90వేలకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడి పెట్టడానికి చాలా మార్గాలు ఉన్నప్పటికీ.. చాలా మంది గోల్డ్ మీదనే ఎక్కువ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనికి కారణం బంగారం ధరలు రోజు రోజుకు గణనీయంగా పెరగడమే. ఇందులో నష్టాలు వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా.. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు కూడా బంగారం ధరలు భారీగా పెరగడానికి కారణమయ్యాయి. ఆర్ధిక పరిస్థితుల అనిశ్చితి ఇలాగే కొనసాగితే.. 2025లో 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 85,000 నుంచి రూ. 90,000లకు చేరుకునే అవకాశం ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)