EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి
Breaking News
పసిడి పరుగు.. భారీగా పెరిగిన బంగారం ధరలు
Published on Thu, 10/03/2024 - 11:21
అక్టోబర్ ప్రారంభంలో తగ్గినట్లే తగ్గిన బంగారం ధర ఒక్కసారిగా ఎగిసి పడింది. దీంతో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ. 77560వద్దకు చేరింది. ఈ రోజు గోల్డ్ రేట్లు.. ఏ నగరం ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..
హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల 10 గ్రాములు బంగారం రేటు రూ. 71,100 వద్ద, 24 క్యారెట్ల 10 గ్రాములు పసిడి ధర రూ.77,560 వద్ద ఉంది. నిన్నటి ధరలో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 100, రూ. 660 పెరిగింది. గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో మాత్రమే కాకుండా.. బెంగళూరు, ముంబైలలో కూడా ఇదే ధరలు ఉంటాయి.
చెన్నైలో కూడా గోల్డ్ రేటు అమాంతం పెరిగింది. దీంతో ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 71100 & 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 77,560గా ఉంది. దీన్ని బట్టి చూస్తే పసిడి ధర నిన్నటి కంటే కూడా రూ. 100, రూ. 110 పెరిగింది.
దేశ రాజధాని నగరం ఢిల్లీలో గోల్డ్ ధరలు వరుసగా రూ. 71,250 (22 క్యారెట్స్ 10 గ్రా), రూ.77,710 (24 క్యారెట్స్ 10గ్రా) వద్ద ఉన్నాయి. బంగారం ధర ఈ రోజు రూ. 100, రూ. 110 పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే.. ఢిల్లీలో ధరలు అధికంగా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది.
ఇదీ చదవండి: ఎస్బీఐ చైర్మన్ కీలక ప్రకటన: ఈ ఆర్థిక సంవత్సరంలో..
వెండి ధరలు
బంగారం ధరల భారీగా పెరిగినప్పటికీ.. వెండి మాత్రమే గత ఐదు రోజులుగా స్థిరంగానే ఉంది. దీంతో నేడు (గురువారం) కేజీ వెండి ధర రూ. 1,01,000 వద్దనే నిలిచింది. బంగారం ధర దూసుకెళ్తుంటే.. వెండి మాత్రం శాంతించినట్లు అర్థమవుతోంది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
Tags : 1