Breaking News

గతి తప్పుతున్న చైనా ఆధిపత్యం

Published on Tue, 05/20/2025 - 14:00

ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, మిలిటరీ అప్లికేషన్లతో సహా హై-టెక్ పరిశ్రమలకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ (ఆర్ఈఈ-స్కాండియం, యిట్రియం, లాంథనం, సీరియం, సెమారియం.. వంటి అరుదుగా దొరికే లోహాలు) కీలకం. దశాబ్దాలుగా చైనా ఎర్త్‌ మైనింగ్, లోహశుద్ధిలో ఆధిపత్య శక్తిగా ఉంది. ప్రపంచ ఉత్పత్తిలో 70% వరకు దాదాపు అన్ని ప్రాసెసింగ్ కార్యకలాపాలను ఇది నియంత్రిస్తుంది. ఇటీవల పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఆర్‌ఈఈకు సంబంధించి చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలని ఇతర దేశాలు యోచిస్తున్నాయి. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఆర్‌ఈఈలను స్వతంత్రంగా ప్రాసెసింగ్‌ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

లైనాస్ రేర్ ఎర్త్స్

అరుదైన లోహాల ఉత్పత్తిలో ‘లైనాస్‌ రేర్‌ ఎర్త్స్‌’ సంస్థ కీలకంగా మారుతుంది. ఇది చైనా వెలుపల భారీ అరుదైన లోహాల వాణిజ్య ఉత్పత్తిదారుగా ఉంది. ఆర్ఈఈ ప్రాసెసింగ్‌పై చైనా గుత్తాధిపత్యాన్ని విచ్ఛిన్నం చేయడంలో మలేషియా కేంద్రంగా ఈ ప్లాంట్ పని చేస్తుంది. ప్రపంచ అరుదైన లోహాల సరఫరాలకు వ్యూహాత్మక ప్రత్యామ్నాయంగా దాని పాత్రను బలోపేతం చేసుకుంటోంది. లైనాస్‌కు యూఎస్‌ ప్రభుత్వం నుంచి మద్దతు లభిస్తోంది.

ఇదీ చదవండి: ఈజ్ మై ట్రిప్ సీఈఓను విచారించిన ఈడీ

ప్రత్యామ్నాయాలు

చైనీస్ రేర్ ఎర్త్ సరఫరాలపై ఆధారపడటం వల్ల కలిగే ఆర్థిక, భద్రతా ప్రమాదాలను గుర్తించి అనేక దేశాలు తమ సొంత వనరులను అభివృద్ధి చేసుకుంటున్నాయి. స్థానికంగా మైనింగ్ కార్యకలాపాలను మెరుగుపరచడానికి తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నాయి.

అక్లారా రిసోర్సెస్ (బ్రెజిల్): యూఎస్‌ ప్రాసెసింగ్ ప్లాంట్‌కు సరఫరా చేయడానికి ఈ రేర్‌ ఎర్త్ గనిని అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచ ఆర్‌ఈఈ సరఫరా గొలుసులో లాటిన్ అమెరికా పాత్రను ఇది మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

యుకోర్ రేర్ మెటల్స్ (యూఎస్‌): అమెరికా రక్షణ శాఖ నిధులతో ఈ సంస్థ చైనా ప్రాసెసింగ్ పద్ధతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో కొత్త సెపరేషన్ టెక్నాలజీపై పనిచేస్తోంది.

ఆస్ట్రేలియా, కెనడా: ఈ దేశాలు తమ రేర్‌ ఎర్త్‌ మైనింగ్ సామర్థ్యాలను వేగంగా విస్తరిస్తున్నాయి. బహుళ కంపెనీలు స్థానిక నిక్షేపాలను అన్వేషిస్తున్నాయి.

#

Tags : 1

Videos

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)