Breaking News

ఇందులో భారత్ అభివృద్ధి ఆగిపోతోంది!: గౌతమ్ సింఘానియా

Published on Sat, 10/18/2025 - 16:21

భారతదేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోంది. అయితే మోటార్‌స్పోర్ట్ రంగం మాత్రం సవాళ్ళను ఎదుర్కొంటోంది. దీనిని అభివృద్ధి చేయాలంటే.. తగిన ఎన్విరాన్‌మెంట్ ఏర్పాటు చేయాలని, రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా (Gautam Singhania) అన్నారు. ప్రపంచ ప్రమాణాలతో పోలిస్తే ఈ విభాగం అంతగా అభివృద్ధి చెందలేదని స్పష్టం చేశారు.

ఒక సమావేశంలో గౌతమ్ సింఘానియా మాట్లాడుతూ, మీరు మోటార్‌స్పోర్ట్‌లో ప్రపంచ స్థాయిలో రాణించాలనుకుంటే, దానికి తగిన పర్యావరణం ఏర్పాటు చేసుకోవాలి. ఉదాహరణకు, భారతదేశంలో క్రికెట్ కోసం ఒక పర్యావరణ వ్యవస్థ ఉంది. కొందరు గల్లీలలో క్రికెట్ ఆడతారు. అలా క్రికెట్ మన జీవన శైలిలో భాగమైపోయింది. క్రికెట్ మాదిరిగా.. మోటార్‌స్పోర్ట్ కోసం ప్రాక్టీస్ లేదు. ప్రస్తుతం మనకు భారతదేశం నుంచి ఐదుగురు మాత్రమే మోటార్‌స్పోర్ట్  లైసెన్స్ హోల్డర్లు ఉన్నారు. ఈ సంఖ్య యూకేలో 70,000 ఉందని ఆయన అన్నారు.

కార్టింగ్ లీగ్‌లు, పబ్లిక్ ట్రాక్‌లు.. పాఠశాల స్థాయి నుంచి అందుబాటులో లేకపోవడం వల్ల ఇందులో (మోటార్‌స్పోర్ట్) అభివృద్ధి ఆగిపోతోంది. నారాయణ్ కార్తికేయన్, జెహాన్ దారువాలా, కుష్ మైనీ.. చిన్న వయస్సు నుండే రేసింగ్‌లో శిక్షణ తీసుకోవడానికి విదేశాలకు వెళ్లాల్సి వచ్చిందని గౌతమ్ సింఘానియా పేర్కొన్నారు.

ఇదీ చదవండి: మరింత తగ్గిన ఆల్టో కే10 ధర: రూ.3.70 లక్షలు!

ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన గౌతమ్ సింఘానియా ఒక ఆటోమోటివ్ ఔత్సాహికుడు. ఈయన చాలా సందర్భాల్లో రేసింగ్‌లో పాల్గొన్నారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా కార్లను కొనుగోలు చేశారు. ఈయన వద్ద లంబోర్ఘిని గల్లార్డో LP570 సూపర్‌లెగ్గేరా, లంబోర్ఘిని అవెంటడోర్ SVJ, ఫెరారీ 458 ఇటాలియా, మరియు మెక్‌లారెన్ 720ఎస్ వంటి రేసింగ్ కార్లు ఉన్నాయి. ఆయన ఇటీవలే వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ కౌన్సిల్ (WMSC)కు భారతదేశ అధికారిక ప్రతినిధిగా నియమితులయ్యారు. ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియాకు ఈ హోదాలో పనిచేస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)