Breaking News

ఈసారి రూ.25,000 కోట్లు తెస్తున్న గణపతి!

Published on Fri, 09/06/2024 - 20:00

దేశంలో జరిగే అత్యంత ప్రసిద్ధమైన పండుగలలో గణేష్ చతుర్థి ఒకటి. పిల్లలు, పెద్దలు అందరికీ ఇష్టమైన ఈ వేడుక వస్తోందంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. దేశవ్యాప్తంగా సంబరాన్ని పంచే గణేష్ చతుర్థి.. ఏటా వేలాది కోట్ల రూపాయల వ్యాపారాన్ని అందిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థకూ తోడ్పడుతోంది.

కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ప్రకారం.. దేశంలో ప్రధాన హిందూ పండుగ అయిన గణేష్ చతుర్థి సందర్భంగా ఈ సారి రూ.25,000 కోట్ల వ్యాపారం జరుగుందని అంచనా. చైనీస్ ఉత్పత్తులను పూర్తిగా పక్కన పెట్టి దేశీయ వస్తువులను వ్యాపారులు ప్రోత్సహిస్తున్న విషయాన్ని వ్యాపారుల సంఘం గుర్తుచేస్తోంది.

దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, గోవా వంటి రాష్ట్రాల్లో గణేష్ చతుర్థి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లో సందర్భంగా జరిగే వ్యాపారం దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతం అందిస్తుందని సీఏఐటీ సెక్రటరీ జనరల్ ఎమిరిటస్ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు.

20 లక్షల గణేష్‌ మంటపాలు
ఈ సారి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 20 లక్షల గణేష్‌ మంటపాలు ఏర్పాటైనట్లు సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు బీసీ భార్టియా తెలిపారు. 7 లక్షలకు పైగా మంటపాలతో మహారాష్ట్ర ముందంజలో ఉండగా, కర్ణాటక 5 లక్షలతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లు ఒక్కొక్కటి 2 లక్షలతో  తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. సెటప్, అలంకరణలు, పూజా కార్యక్రమాలకే ఒక్కో మంటపానికి కనీసం రూ.50,000 ఖర్చవుతుందని, మొత్తం ఖర్చు రూ.10,000 కోట్లు దాటుతుందని ఆయన భావిస్తున్నారు.

గణేష్‌ విగ్రహాల వ్యాపారమే రూ. 500 కోట్లకు పైగా ఉంటుందన్నారు. పూలు, దండలు, కొబ్బరికాయలు వంటి నిత్యావసర వస్తువులు ఆర్థిక వ్యవస్థకు మరో రూ. 500 కోట్లు జోడిస్తాయన్నారు. ఇక లడ్డూలు, ఇతర స్వీట్స్‌కు సంబంధించిన అమ్మకాలు రూ. 2,000 కోట్లకు మించి ఉంటాయని అంచనా. క్యాటరింగ్ వంటి సేవల ద్వారా జరిగే దాదాపు రూ. 3,000 కోట్లు ఉంటుంది.

పండుగ సందర్భంగా జరిగే ప్రయాణాలు, బస ఖర్చు సుమారు రూ. 2,000 కోట్లు, పండుగ సంబంధిత వస్తువులైన బట్టలు, ఉపకరణాలు, గృహాలంకరణ, బహుమతి వస్తువుల రిటైల్ విక్రయాలు దాదాపు రూ. 3,000 కోట్లకు చేరవచ్చు. ఇక ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు పెద్ద ఎత్తున పబ్లిక్ ఈవెంట్‌లను నిర్వహించడం ద్వారా రూ. 5,000 కోట్లు ఆర్జిస్తున్నాయని  బీసీ భార్టియా వివరించారు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)