Breaking News

సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే!

Published on Sat, 02/07/2026 - 19:40

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశంపై దేశంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సమయంలో.. భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ. అనంత నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

ఏఐ ఉద్యోగాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.. ఖచ్చితమైన అంచనాలు వేయడం కష్టం. అయినప్పటికీ.. దీని పురోగతి వల్ల కోడింగ్ వంటి ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల తొలగింపులకంటే ఎక్కువగా.. నియామకాలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ మార్పు కొంతకాలంగా మొదలైందని.. శ్రీధర్ వెంబు వంటి వారు కూడా ఏఐ సాధనాలు కోడింగ్‌లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పిన మాటలు గుర్తు చేశారు.

సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసేవారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అనంత నాగేశ్వరన్ అన్నారు. ఏఐ ప్రభావానికి గురికాని ఉద్యోగాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.ఇందులో టూరిస్ట్ గైడ్స్, కేర్ ఎకానమీ (వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారి సంరక్షణ), ఆరెంజ్ ఎకానమీ (సంస్కృతి, సృజనాత్మకత, కంటెంట్ ఆధారిత రంగాలు) ఉన్నాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా మాట్లాడుతూ.. ఏఐ మొత్తం ఉద్యోగాలపై సానుకూల ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగాలు నశించినా, కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయని అన్నారు. ముఖ్యమైన సవాలు ఏమిటంటే.. ఈ మార్పును సక్రమంగా నిర్వహిస్తూ.. యువత సిద్ధంగా ఉండాలని తెలిపారు.

#

Tags : 1

Videos

రాజు ఎక్కడున్నా రాజే.. చెన్నైలో వైఎస్ జగన్ ప్రభంజనం

నెల్లూరు సెంట్రల్ జైల్లో పిన్నెల్లిని ములాఖత్ లో కలిసిన చెవిరెడ్డి

రాంబాబు భౌతికకాయానికి నివాళులర్పించిన వైఎస్సార్సీపీ నేతలు

పవన్ కల్యాణ్ ఇప్పుడే గుర్తొచ్చారా? అంబటి మౌనిక అదిరిపోయే రిప్లై

50 మంది విద్యార్థులకు అస్వస్థత.. రంపచోడవరం ప్రభుత్వాస్పత్రికి తరలింపు

సౌందర్యతో సినిమా నా జన్మ ధన్యమైంది.. 365 రోజులు ఆడిందంటే నేనే నమ్మలేదు

ఈ నెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు

తిరుమల లడ్డు ప్రసాదంపై ది వైర్ వెబ్ సైట్ సంచలన కథనం

చంద్రబాబు, పవన్ కుట్రలు చేస్తున్నారు.. కూటమిలో భయం మొదలైంది

టీడీపీ నేతలే షాక్ అయ్యేలా ఎల్లో భజన చేస్తున్న జనసేన బ్యాచ్

Photos

+5

వైట్ టాప్ లో టాప్ లేపుతున్న జాక్వెలిన్.. గ్లామర్ (ఫొటోలు)

+5

సమ్మక్క–సారలమ్మ జాతర హుండీల లెక్కింపు (ఫొటోలు)

+5

ఏపీలో ఉన్న ఈజలపాతం తెలుసా.. కదిలే వంతెనలు..అదిరే గుండెలు (ఫొటోలు)

+5

కొత్త సినిమా ప్రారంభోత్సవంలో సాయి పల్లవి, శ్రీలీల (ఫొటోలు)

+5

అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన భారత్..వైభవ్ సూర్యవంశీ రికార్డుల మోత (ఫొటోలు)

+5

ఐస్‌క్రీం ఈవెంట్ లో సినీ నటి రీతూవర్మ సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఆభరణాల ప్రదర్శనలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

జగన్‌ రాకతో జన జాతరను చూశారా? (ఫొటోలు)

+5

హైదరాబాద్ : షాపింగ్ మాల్ ఓపెనింగ్‌లో హీరోయిన్ శ్రీలీల సందడి (ఫొటోలు)

+5

#WPL2026 : ఫైనల్లో ఆర్సీబీ విజయం..రూ. 6 కోట్లు ప్రైజ్‌మనీ (ఫొటోలు)