Breaking News

భారత్‌లో ప్లాంట్లు పెట్టండి

Published on Thu, 11/28/2024 - 06:38

న్యూఢిల్లీ: భారత్‌లో తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయడాన్ని పరిశీలించాలని ఫ్రాన్స్‌ ఏవియేషన్‌ సంస్థలను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ కోరారు. విమానాశ్రయాలు, అనుబంధ పరిశ్రమలను అభివృద్ధి చేయదల్చుకునే సంస్థలకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ మార్కెట్ల కోసం ఉత్పత్తులను తయారు చేసేలా రక్షణ రంగంలో భారత్, ఫ్రాన్స్‌ కంపెనీలు కలిసి పని చేయొచ్చని మంత్రి తెలిపారు. వ్యవసాయం, ఫుడ్‌ ప్రాసెసింగ్, రెన్యువబుల్‌ ఎనర్జీ, ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్‌ తదితర విభాగాల్లో భారత సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవచ్చని గోయల్‌ వివరించారు.

 ఫ్రెంచ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ అడ్వైజర్లకు సంబంధించిన ఆసియా–పసిఫిక్‌ ఫోరంలో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దేశీ విమానయాన సంస్థలు 1,500 పైచిలుకు విమానాలకు ఆర్డర్లివ్వగా అందులో సింహభాగం వాటా ఫ్రాన్స్‌ కంపెనీ ఎయిర్‌బస్‌కి లభించాయి. భారత్‌లో సుమారు 750 ఫ్రెంచ్‌ కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తుండగా, 75 భారతీయ కంపెనీలు ఫ్రాన్స్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇరు దేశాల మధఅయ 2023–24లో 15 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. భారత్‌ ఎగుమతులు 7 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, దిగుమతులు 8 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)