Breaking News

భారత్‌లో ఫాక్స్‌కాన్‌ బ్యాటరీ స్టోరేజ్‌ ప్లాంట్‌

Published on Mon, 08/19/2024 - 04:58

శ్రీపెరంబదూర్‌: భారత్‌లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నట్టు తైవాన్‌కు చెందిన ఎల్రక్టానిక్స్‌ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ చైర్మన్‌ యాంగ్‌లీ ప్రకటించారు. ఎలక్ట్రిక్‌ వాహన విభాగంపై దృష్టితో బ్యాటరీ తయారీ వ్యాపార విస్తరణపై ఫాక్స్‌కాన్‌ దృష్టి సారించింది. ఈ సంస్థ ఈ–బస్‌ల కోసం తైవాన్‌లో ఇలాంటి ప్లాంట్‌ ఒకదాన్ని ఇప్పటికే ఏర్పాటు చేయగా, ఈ ఏడాదే ఉత్పత్తి మొదలు కానుంది.

 ‘‘3ప్లస్‌3 భవిష్యత్‌ పరిశ్రమ ఏర్పాటుకు వేచి చూస్తున్నాం. తమిళనాడులో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎస్‌ఎస్‌) ఏర్పాటు విషయంలో సహకారం ఎలా అన్నదానిపై పరిశ్రమల మంత్రితో చర్చిస్తున్నా’’ అని యాంగ్‌లీ తెలిపారు.  సోలార్, విండ్‌ టర్బయిన్ల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్‌ను నిల్వ చేసేందుకు బ్యాటరీ స్టోరేజ్‌ వ్యవస్థలు వీలు కలి్పస్తాయి. 

మన దేశం పెద్ద ఎత్తున పునరుత్పాదక ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇస్తుండడం తెలిసిందే. దీంతో ఈ విభాగంలో అవకాశాలను సొంతం చేసుకునేందుకు ఫాక్స్‌కాన్‌ ఆసక్తిగా ఉన్నట్టు యాంగ్‌లీ మాటలను బట్టి తెలుస్తోంది. భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ దిశగా ఫాక్స్‌కాన్‌ ప్రణాళికలు అమలు చేస్తోంది. త్వరలోనే ఈవీల తయారీ మొదలవుతుందని యాంగ్‌లీ తెలిపారు. 

భారత్‌లో ఇప్పటివరకు తాము 1.4 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేశామని, వ్యాపారం 10 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందినట్లు చెప్పారు. రానున్న ఏడాది కాలంలో మరిన్ని పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. ప్రస్తుత భారత పర్యటనలో భాగంగా పలు రాష్ట్రాల సీఎంలతో యాంగ్‌లీ సమావేశం కావడం గమనార్హం. ఎన్నో రాష్ట్రాలను సందర్శించిన తర్వాత భారత్‌ వృద్ధి పథకంలో ఉందని అర్థమవుతోందంటూ.. ఈ ప్రయాణంలో ఫాక్స్‌కాన్‌ సైతం భాగస్వామి కావాలనుకుంటున్నట్టు యాంగ్‌లీ చెప్పారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)